Vishnu Manchu : నా చిత్రపరిశ్రమను బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను..
- కొండా సురేఖ వ్యాఖ్యలపై లేఖ విడుదల చేసిన మా అసోసియేషన్
- మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చలలోకి లాగకండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో, వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. మన పరిశ్రమ, ఇతర రంగాలవలె, పరస్పర గౌరవం మరియు నమ్మకంతో నడుస్తుంది. కానీ నిజం కాని కథనాలను ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తుంది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం, కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే వారికి కూడా గౌరవం మరియు రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం, లేదా వారి వ్యక్తిగత జీవితాలు అబద్దపు ఆరోపణలలోకి లాగబడటం ఇష్టం పడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు ఆ గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం.
Also Read : Konda Surekha : కొండా సురేఖకు చిరంజీవి, RGV స్వీట్ వార్నింగ్..!
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
నాయకులు, రాజకీయ నాయకులు, మరియు ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను – దయచేసి రాజకీయ కధనాల కోసం లేదా ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా నటుల పేర్లు మరియు వారి కుటుంబాల పేర్లు వాడకండి. మేము, చిత్రపరిశ్రమలో పనిచేసేవారు, సమాజానికి వినోదం ఇవ్వడానికి మరియు సహకరించడానికి ఎంతో కష్టపడుతున్నాము. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చలలోకి లాగకూడదు అని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Also Read : Tollywood : మంత్రి కొండా సురేఖకు టాలీవుడ్ నటీనటుల వార్నింగ్..
మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా మనుషులుగా కూడా మన కుటుంబాల పైన వచ్చే అబద్ధపు కథనాల వలన కలిగే బాధ చాలా తీవ్రమైనది. ఇలాంటి సంఘటనలు మరింత సమస్యలని బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిస్తాం.పరిశ్రమ తరపున, నేను మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. మేమంతా ఏకమై నిలబడతాం.
విష్ణు మంచు
తాజావార్తలు
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!