Mahalaya Amavasya 2024: హిందూ మతంలో మహాలయ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే., ఈ రోజున తల్లి దుర్గా కైలాస పర్వతానికి వీడ్కోలు పలికింది. అమ్మవారి ఆగమనాన్ని ‘మహాలయ’ అంటారు. ఇది దుర్గా పూజ పండుగ ప్రారంభానికి గుర్తుగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం 2024లో మహాలయ అమావాస్య ఎప్పుడు, దాని ప్రాముఖ్యత, తిథి, శుభ సమయం గురించి చూద్దాం.
Gandhi Jayanthi 2024: భారత కరెన్సీపై మహాత్మా గాంధీ ఫోటో పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసా?
మహాలయ అమావాస్య ఎప్పుడు?
మహాలయ అమావాస్య 2 అక్టోబర్ 2024. హిందూ క్యాలెండర్ ప్రకారం, మహాలయ అమావాస్య పితృ పక్షం (చివరి రోజు) ముగింపు. అలాగే శారదీయ నవరాత్రుల ప్రారంభానికి గుర్తుగా పరిగణించబడుతుంది. అమావాస్య అక్టోబర్ 01 రాత్రి 09.38 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 02 మధ్యాహ్నం 12.19 గంటలకు ముగుస్తుంది. మహాలయ అంటే దేవి యొక్క గొప్ప నివాసం. సర్వ పితృ అమావాస్య నాడు పూర్వీకుల శ్రాద్ధ కర్మలను ఆచరించిన తరువాత, పూర్వీకులు వారి లోకానికి తిరిగి వస్తారు. దీని తరువాత, శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి.
Iran Israel War: విజయం దగ్గర్లోనే ఉంది.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!
మహాలయ అమావాస్య ఎందుకు జరుపుకుంటారు?
మహాలయ అమావాస్య నాడు పూర్వీకుల శ్రాద్ధం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరడమే కాకుండా.. తర్పణం చేసే వారి జీవితం ఆనందమయం, కుటుంబంలో జరుగుతున్న సమస్యలు తొలగిపోతాయి. మహాలయనాడు నిరుపేదలకు దానం చేసిన వారికి పూర్వీకుల ఆశీస్సులు, దుర్గామాత అనుగ్రహం కలుగుతుంది. ఈరోజున ముఖ్యంగా మహాలయ నాడు బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, దానాలు చేయడం వల్ల పూర్వీకులు శాంతిని పొంది సంతోషంగా పితృలోకానికి చేరుకుంటారు.
ఈ రోజున పూర్వీకులకు పాలు, నువ్వులు, కుశ, పువ్వులు కలిపిన నీటిని సమర్పిస్తారు.