తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం మొదలైనట్లు కనపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ దుమారం రేపింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అసమ్మతితోనే పార్టీ సీనియర్లు సమావేశమయ్యారని వార్తలు వినిపించాయి. అయితే ఈ మీటింగ్ భట్టి లాంటి వారు స్పష్టతనిస్తూ.. అలాంటిదేమీ లేదని.. సోనియా, రాహుల్ గాంధీల సారథ్యంలోనే కాంగ్రెస్ నడిచేందుకు నిర్ణయం తీసుకున్నామని.. దానిపైనే సమావేశమయ్యామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు మరోసారి సీనియర్లు సమావేశం కానున్న నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజు సీనియర్లు ఫోన్ చేయడం.. ఈ సమావేశం నిర్వహిస్తే.. తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పడంతో మరోసారి కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డిపై ఉన్న విముఖత బయటపడింది.
ఏదైనా సమస్య ఉంటే పార్టీ సమావేశాల్లో చర్చించాలని, లేకుండా సోనియా, రాహుల్ గాంధీలతో ముచ్చటించాలని బోస్‌రాజు హితవు పలికారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ రేవంత్‌రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టారు. రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే.. తన నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరుపున ఓ అభ్యర్థిని నిలబెట్టాలని, తాను ఇండిపెండెంట్‌గా నిలబడి గెలుస్తానని సవాల్ విసిరారు. జగ్గారెడ్డి చేసిన సవాల్ టీకాంగ్రెస్‌లో సీనియర్లకు జూనియర్లకు మధ్య సమస్యలు ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. అయితే దీనికీ కారణం లేకపోలేదు.. ఇటీవల దేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత ఎన్నికల్లో పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ సారి ఆ రాష్ట్రాన్ని కూడా చేజార్చుకుంది. దీంతో క్రింది స్థాయి నేత నుంచి అగ్రస్థాయి నేతలవరకు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందో అర్థకాలేదు.
ఈ విషయాన్ని జగ్గారెడ్డి ఉటంకిస్తూ.. పంజాబ్‌లో పీసీసీ చీఫ్ సిద్దూ తీరుతోనే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిందని.. అలా ఉంటే.. ఫలితాలు ఇలాగే ఉంటాయని రేవంత్ రెడ్డికి చురకలు అటించారు. అయితే తెలంగాణలో రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని అధిష్టానం సూచిస్తుంటే.. టీకాంగ్రెస్ నాయకుల మధ్యనే సఖ్యత లేకుండా.. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం ఏం నిర్వహిస్తారు.. అనే భావన రాజకీయ విశ్లేషకుల మదిలో మెదులుతోంది. చూడాలి మరి.. జగ్గారెడ్డి బస్తీమే సవాల్‌కు.. రేవంత్ రెడ్డికి ఏవిధంగా కౌంటర్ ఇస్తారోనని..