కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలు పెట్టా.. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది.. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.. సగం దూరం నడిచేటప్పటికి నేను గతంలో లాగా లేను.. ప్రజలతో ఎలా మాట్లాడాలో.. వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నా.. నేను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం.. మహిళలను కోటీశ్వరులను చేయడమే మా అజెండాగా పెట్టుకున్నాం.. మహిళా పారిశ్రామిక వేత్తలను బడా పారిశ్రామిక వేత్తలుగా చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
Bharat Summit : పెట్టుబడులు, న్యాయం, ప్రపంచ శాంతి, అహింస అనే మహత్తర లక్ష్యాలతో ప్రతిష్టాత్మక భారత్ సమ్మిట్ – 2025 నేడు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ), నోవాటెల్‌లో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ సమ్మిట్‌కు విచ్చేసిన వివిధ దేశాల ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అపూర్వ…
Pahalgam Attack : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో తెలంగాణలో హై అలెర్ట్ ప్రకటించబడింది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల అవకాశాలపై వచ్చిన విశ్వసనీయ సమాచారంతో రాష్ట్ర పోలీసు శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని హెచ్‌ఐసీసీ, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (CS) శాంతికుమారి, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అలెర్ట్ చేయగా, డీజీపీ అనjani కుమార్ రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు…