కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలు పెట్టా.. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది.. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.. సగం దూరం నడిచేటప్పటికి నేను గతంలో లాగా లేను.. ప్రజలతో ఎలా మాట్లాడాలో.. వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నా.. నేను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
ఇవాళ పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది. పార్లమెంట్ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్ చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
మణిపూర్ లో చేలరేగిని హింస నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రధాని మోడీతో సమావేశం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు 40 మంది ఎమ్మెల్యేలు పీఎంఓకు ఓ లేఖ రాశారు.
మోడీ సర్కార్ పై ప్రతిపక్షాల కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు మూడో రోజు చర్చకు రానుంది. ఎన్డీఏపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో మణిపూర్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారోనని ఉత్కంఠ నెలకొంది.