అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అనిల్ రావిపూడి ప్రస్తుతానికి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే అది పూర్తయిన తర్వాత సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. అయితే అనూహ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్రలో ఒక యంగ్ హీరో నటిస్తున్నాడని వార్త నిన్న సాయంత్రం వైరలైంది.
Also Read:AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ లో 400 మెడికల్ ఆఫీసర్ జాబ్స్.. అర్హులు వీరే
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ, అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడనేది ఆ వార్త సారాంశం. అయితే ఇన్‌సైడ్ వర్గాల సమాచారం మేరకు కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటించడం అనే వార్త పూర్తి ఫేక్ అని సమాచారం. అనిల్ రావిపూడి అలాంటి ఆలోచన ఏదీ చేయలేదని అంటున్నారు.
Also Read:Ponnam Prabhakar: మంత్రి చొరవతో దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న గల్ఫ్ బాధితుడు
ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారుపాడితో కలిసి, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుశ్మిత కొణిదల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ అనిల్ రావిపూడి సినిమా టీం ఎవరైనా అధికారికంగా ఖరారు చేస్తే తప్ప, అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయనే విషయం చెప్పలేని పరిస్థితి.