IMD Weather: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిలాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందిన తెలిపింది. రాష్ట్రంలో పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని, సాయంత్రం చల్లగా ఉంటుందని, పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో వాతావరణంలో స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపారు.
Read also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు విచారణకు ఆ నేత..
కాగా.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాల్లో 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్తమా, దగ్గు, జలుబు ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని, వెచ్చటి దుస్తులు ధరించాలని చెప్పారు. వేడివేడి ఆహారాన్ని తినాలని, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
Read also: Rajanna Sircilla Crime: సిరిసిల్లలో దారుణం.. దంపతుల అనుమానస్పద మృతి..
అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈరోజు ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, బాపట్ల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. గుంటూరు, వైఎస్ఆర్, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, శ్రీ సత్యసాయి, కడప, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. నెల్లూరు, కావలి పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైతులు తమ పంట పొలాల్లోని అదనపు నీటిని ఒడిసిపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
CM Revanth Reddy: నేడు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు.. హాజరు కానున్న సీఎం