Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదిలి పెట్టడం లేదు. వర్షాకాలం ముగిసినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో వానలు కురుస్తూనే పడుతున్నాయి.
AP Cyclone: మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. తుఫాన్ కారణంగా జిల్లాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Rains : తెలంగాణలో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్మాల్, నిజమాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ 4 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. తెలంగాణలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. Read Also…
CM Revanth Reddy: హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి…
IMD Weather: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
IMD Weather: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్షసూచన చేసింది. రాబోయే రోజుల్లో కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, కర్ణాటక, ఏపీలోని రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రాబోయే ఐదు రోజుల్లో కేరళ, కర్ణాటక, గోవాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆయా రాష్ట్రాలు వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందాయి.