OTS Scheme: జలమండలి ఓటీఎస్ ఆఫర్ నేటితో ముగియనుంది. పెండింగ్‌లో ఉన్న వాటర్ బిల్లులు చెల్లించేందుకు వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని జలమండలి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నీటి బకాయిలు పెరుగుతుండటంతో వన్ టైమ్ సెటిల్మెంట్ ఆఫర్ ను తెచ్చింది. జలమండలికి రూ.1700 కోట్ల రూపాయల బకాయిలు ఉండంతో.. ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించేలా ఆఫర్ తీసుకువచ్చింది.
అయితే.. ఓటీఎస్ ద్వారా రెండు నెలల్లో 75 కోట్లు మాత్రమే వసూలు చేశారు. బిల్లులు పెండింగులో ఉన్న వినియోగదారులపై డిసెంబర్ 1 నుంచి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. OTSని ఉపయోగించిన వినియోగదారులు ఈ గడువులోపు అంటే నేడు అసలు మొత్తాన్ని చెల్లిస్తే, వారు ఎలాంటి వడ్డీ లేదా ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు ముగిసిన తర్వాత అంటే (డిసెంబర్ 1)నుంచి చెల్లిస్తే పెండింగ్‌లో ఉన్న బిల్లులపై వడ్డీ, పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈరోజు చివరి రోజు కావడంతో ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.
Read also: Amaran Movie Meets Rajnath Singh: కేంద్రమంత్రిని కలిసిన అమరన్ మూవీ టీమ్.. అభినందల వెల్లువ
ఈరోజు ముగిసిన అంతరం పెండింగ్ బిల్లుకు పెనాల్టీ కట్టాల్సి వుంటుందని గుర్తుచేశారు. అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ పథకం నవంబర్ నెలాఖరు వరకు కొనసాగింది. అయితే పండుగలు రావడంతో.. మళ్లీ పథకాన్ని పొడిగించాలని వినతులు అందాయి. దీంతో ఈ పథకాన్ని పొడిగించాలని జలమండలి ప్రభుత్వానికి లేఖ రాయగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మరో నెల, అంటే నవంబర్ 30 వరకు పొడిగించేందుకు అనుమతించింది. ఇక పొడిగించే అవకాశం లేకపోవడంతో పథకం గడువు ముగిసినా బిల్లులు పెండింగ్ లో ఉన్న వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే, వారి నీటి కనెక్షన్లు కూడా డిస్కనెక్ట్ చేయనున్నారు.
Read also: CM Chandrababu : నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
బిల్లులు చెల్లింపు విధానం:
వాటర్ బోర్డ్ కార్యాలయాల ద్వారా, ఆన్‌లైన్‌లో మీ-సేవ, AP ఆన్‌లైన్ కేంద్రాలు, ఫోన్ పే, Google Pay, Paytm, NEFT, RTGS, BPPS, వాటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్, లైన్ మెన్ ద్వారా చెల్లింపు చేయవచ్చని తెలిపారు. దీని ద్వారా బకాలు చెల్లించాలన్నారు. కాగా.. బిల్లులు పెండింగులో ఉన్న వినియోగదారులపై డిసెంబర్ 1 నుంచి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
Farmers Festival: నేడు పాలమూరులో రైతు పండగ ముగింపు సభ.. సీఎం శుభవార్త చెబుతారా..