Farmers Festival: నేడు మహబూబ్ నగర్ లో జరుగుతున్న రైతు సదస్సు కీలక ప్రకటనలకు వేదిక కానుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా పథకం అమలుపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఈ ఏడాది రెండో పంట సీజన్ నుంచి సంక్రాంతి పండుగ నుంచి ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా.. ఈ ఏడాది రెండో పంటకాలం నుంచి ఎకరానికి రూ.7,500 చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై కూడా మహబూబ్‌నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది.
Read also: CM Revanth Reddy: నేడు పాలమూరులో సీఎం పర్యటన.. మూడంచెల భద్రత
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ.5వేల చొప్పున ఉన్న పెట్టుబడి సాయాన్ని రూ.7,500 పెంచడమే కాకుండా రైతు భరోసా పేరుతో అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఈ పథకం ప్రారంభం కాకపోవడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు రైతు సదస్సులో సీఎం ఈ అంశంపై కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. దీంతోపాటు రైతు రుణమాఫీ పథకం కింద రూ.2 లక్షల వరకు బకాయిలున్న రైతులకు రుణమాఫీ చేసి చెక్కులు పంపిణీ చేయనున్నారు సీఎం.
Read also: Astrology: నవంబర్ 30, శనివారం దినఫలాలు
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ మేరకు అధికారులు సేకరించిన వివరాల ఆధారంగా ఇప్పటికే జాబితా సిద్ధం చేశారు. అంతేకాకుండా రైతు పండుగ సందర్భంగా రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం శుభవార్త ఇస్తారని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రూ. 2 లక్షలకు పైగా వున్న పంట రుణాలను మాఫీ చేస్తామని, ప్రభుత్వమే చెల్లిస్తుందని.. మిగిలిన మొత్తాన్ని రైతులే భరించాలని పలు సందర్భాల్లో ప్రజా ప్రతినిధులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.2 లక్షలు పైబడిన రుణమాఫీపై కూడా సీఎం రేవంత్ ఇవాళ శుభవార్త చెబుతారని అన్నదాతల్లో ఆశలు నెలకొంది.
Read also: ChampionsTrophy2025: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పాక్‌తో ఐసీసీ కీలక భేటీ
బహిరంగ సభకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రైతు పండగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రైతులను సమీకరించే బాధ్యతను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తీసుకున్నారు. మహబూబ్ నగర్ రీజియన్ నుంచి 657 బస్సులను ఆర్టీసీ కేటాయించింది. బహిరంగ సభకు సుమారు లక్ష మంది వస్తారన్న అంచనాతో తగిన ఏర్పాట్లు చేశారు. 2 వేల మందితో పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Puspa 2 Movie Event: ముంబైలో స్టేజి పైనే రెచ్చిపోయిన ఐకాన్ స్టార్, నేషనల్ క్రష్