Harish Rao: జైనూర్… ఘటన అత్యంత పాశవికంగా జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈమధ్య కాలంలో తరుచుగా ఇటువంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 1900 హత్యాచారం కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. మా ప్రజాప్రతినిధులు అసెంబ్లీ లో మాట్లాడితే… స్పందన లేదన్నారు. ఈ మరుసటి రోజు మరొక ఘటన చోటుచేసుకుందన్నారు. హైద్రాబాద్ అంటే ఒకప్పుడు మతకలహాలు జరుగుతాయని అనేవారు… Law and order నీ అదుపులోకి తెచ్చారు కేసీఆర్ అని తెలిపారు. కానీ ఇప్పుడు అస్తవ్యస్తం అయ్యిందన్నారు. దేశంలో అనేక సంస్థలు ఇక్కడ క్రైమ్ రెట్ తక్కువ అని ప్రశంసించారన్నారు. హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ నీ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అద్భుతంగా పరిపాలించారని, అసలు ఈ రాష్ట్రం లో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. యువకుల చేతుల్లో తుపాకులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో తుపాకులు రాజ్యమేలుతున్నాయన్నారు.
Read also: Edupayala Temple: గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా వరద
ఈ 9 నెలల్లో నాటు తుపాకులు ఇప్పటికే వందల సంఖ్యలో తుపాకులు దొరికాయన్నారు. కొత్త డీజీపీ వచ్చిన తరువాత మతకలహాలు జరుగుతున్నాయని తెలిపారు. మెదక్ లో law and order లో ఫెయిల్ అయిన తరువాత ఒక అధికారిని తీసుకుని వచ్చి హైదరాబాద్ లో మంచి స్థానం లో అపాయింట్ చేశారన్నారు. డయల్ 100 కూడా పనిచెయ్యడం లేదన్నారు. పోలీసులను పనిచెయ్యనియ్యడం లేదు… వారిని ఇతర కార్యక్రమాలకు వాడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ వరద విపత్తు సహాయం చెయ్యడంలో విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు అత్యాచారాలు, ప్రతిపక్షాలను వేధించడం… ఇవే కనిపిస్తున్నాయన్నారు. నిన్న ఎన్కౌంటర్ జరిగింది.. కేసీఆర్ హయంలో ఒక్క ఎన్కౌంటర్ జరగలేదు… కాంగ్రెస్ వచ్చిందన్నారు. ఫేక్ ఎన్కౌంటర్ లు మొదలయ్యాయని మండిపడ్డారు. జైనూర్ ఘటన పై ప్రభుత్వం స్పందించాలన్నారు. గిరిజన మహిళ పై అత్యాచార యత్నం జరిగితే పరామర్శించడానికి సమయం లేదా ముఖ్యమంత్రి కి అని ప్రశ్నించారు. వెంటనే ఆమెకు 10 లక్షల ఎక్సగ్రేసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Whiskey Ice Cream: హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీం కలకలం..