TG Bharath: శ్రీసిటీ తరహాలో ఇండస్ట్రియల్ జోన్లను తయారుచేయాలి.. మంత్రి టి.జి భరత్..
- శ్రీసిటీ తరహాలో ఇండస్ట్రియల్ జోన్లను తయారుచేయాలి..
- ఏపీఐఐసీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి
- సమావేశంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ సెక్రటరీ ఎన్. యువరాజు - కమిషనర్ శ్రీధర్.
- ఇండస్ట్రియల్ జోన్లలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్న మంత్రి టి.జి భరత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Bharath: రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ జోన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ సెక్రటరీ యువరాజు, కమిషనర్ శ్రీధర్‌తో పాటు అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం ఆయన నిర్వహించారు. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ జోన్ల గురించి మంత్రి భరత్ ఆరా తీశారు. భూముల విలువ, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు, ల్యాండ్ అలాట్మెంట్ల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Cyber Crime: స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ.. హైదరాబాద్ లో నాలుగు కోట్ల ఘరానా మోసం..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఇండస్ట్రియల్ జోన్ లలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ముందుకు వెళ్లాలని ఆయన చెప్పారు. అన్ని జిల్లాల్లో ఉన్న పాత ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రియల్ పార్క్ స్థలాలు నగరాల్లో కలిసిపోయింటే వాటి ద్వారా రెవెన్యూ జనరేట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో., ఆక్రమణకు గురవ్వకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌తో పారిశ్రామికవేత్తలకు పాజిటివ్ సంకేతం ఇప్పటికే వెళ్లిందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో మంది పెట్టుబడిదారులు చర్చలు జరుపుతున్నారని.. ఇండస్ట్రియల్ జోన్లలో అన్ని సమస్యలు పరిష్కరించి వారికి అనుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అధికారులకు తెలియజేశారు.
Drugs Mafia: డ్రగ్స్‌పై తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం..
ల్యాండ్ రేట్లు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలన్నీ ఒక కొలిక్కి తీసుకురావాలన్నారు. శ్రీసిటీ తరహాలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని మంత్రి టి.జి భరత్ సూచించారు. త్వరలోనే విజయవాడ, విశాఖతోపాటు ఇతర ఇండస్ట్రియల్ జోన్లను సందర్శిస్తానని చెప్పారు. ఇండస్ట్రియల్ జోన్ల అభివృద్ధిలో కింది స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో జెడ్.ఎంలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!