CMR Shopping Mall: సీఎంఆర్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక నూతన షాపింగ్ మాల్ రాజాంలో ఘనంగా ప్రారంభించారు. రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళి షాపింగ్ మాల్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. రాజాంలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ను ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందని, మావూరి వెంకటరమణ వారి తనయుడు బాలాజీ రాజాంలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ను ప్రారంభించడంతో రాజాం పట్టణ వాసులకు మాత్రమే కాక చుట్టుపక్కల 20 మండలాల ప్రజలకు ఎంతో అనుకూలవంతమైందన్నారు. అంతేగాక 300 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు. షాపింగ్ మాల్ లో అన్ని విభాగాలను ప్రత్యేకంగా పరిశీలించి పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు అన్ని విభాగాలలోనూ విభిన్నమైన వస్త్రాలను అందరికీ అందుబాటు ధరల్లో అందించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
Read Also: Ajay Devgn: హైదరాబాద్ థియేటర్ మార్కెట్‌పై కన్నేసిన అజయ్ దేవగన్..
అనంతరం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విశిష్టమైన, ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సినీనటి శ్రీలీల విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్బంగా శ్రీలీల మాట్లాడుతూ.. రాజాంలో ఇన్ని వేల మంది అభిమానులు తన కోసం విచ్చేయడం చూసి మాటలు రావట్లేదని అన్నారు. అభిమానులతో సెల్ఫీలు దిగి డాన్సులతో అందరినీ అలరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సీఎంఆర్ షాపింగ్ మాల్ తో తనకు కూడా ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలతో, విభిన్న శ్రేణిలో వస్త్రాలు ఇక్కడ లభిస్తున్నాయి.. పండుగల సందర్భంగా మరింత ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు.
Read Also: NBK 111 : మరోసారి పాట పాడబోతున్న బాలయ్య.. కన్ఫామ్ చేసిన తమన్
ఇక, సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. రాజాం అంటే తమకు కూడా ఎంతో ప్రత్యేకమైన అభిమానమని, అందుకే గత కొన్ని నెలల క్రితం ఇక్కడ సీఎంఆర్ జ్యూవలరీ ప్రారంభించామన్నారు. ఇప్పుడు ఎంతో విశాలమైన ప్రాంగణంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా ఎన్నో అద్భుతమైన కలెక్షన్స్ తో, అన్ని వర్గాల ప్రజలకి అనుకూలమైన, విస్తృతమైన శ్రేణి వస్త్రాలను అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఈ ప్రత్యేక ఆఫర్స్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ బాలాజీ, లింగమూర్తి, సీవీ జగన్నాథ స్వామి, ప్రత్యేక అతిథిగా కోట శ్రీనివాస్ ప్రథమ కొనుగోలుదారుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంకాల సమయంలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది అండ్ టీం ప్రత్యేకమైన కార్యక్రమాలతో ప్రజలను ఉర్రూతలూగించారు.