కాంటా లగా సాంగ్ ఫేమ్, నటి షెఫాలి జరివాలా మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం రాత్రి ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు షికార్లు చేశాయి. అయితే ఆమె మృతిపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అయితే షెఫాలి జరివాలా మరణవార్త తెలిసి అభిమానులు, కుటుంబ సభ్యులంతా షాక్‌లో ఉంటే.. ఆమె భర్త మాత్రం తాపీగా అపార్ట్‌మెంట్ ముందు శనివారం ఉదయం డాగ్‌తో వాకింగ్ చేయడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో పోలీసులకు మరింత అనుమానాలు రేకెత్తించాయి. ఇప్పటికే ముంబై పోలీసులు ఆమె ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఆమె మృతి వెనుక ఏవో బలమైన కారణాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bihar Elections: బీహార్‌లో యంగ్ ఓటర్లే అధికం.. ఈసారి ఎటువైపో..!
షెఫాలి జరివాలా మృతికి పూర్తి కారణాలు ఇంకా తెలియలేదని తాజాగా ముంబై పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి 1 ఒంటి గంట సమయంలో పోలీసులకు సమాచారం వచ్చిందని చెప్పారు. వెంటనే అంధేరీలోని షెపాలి నివాసంలో ఆమె మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం కోసం పంపించినట్లు వెల్లడించారు. తొలుత ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారని.. కానీ ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్‌ను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారని. వంట మనిషి, ఇంట్లో పని చేసేవారిని కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే శనివారం ఉదయం ఆమె భర్త పెంపుడు కుక్కతో అపార్ట్‌మెంట్ ముందు నడుస్తూ కనిపించారని పేర్కొ్న్నారు. ప్రస్తుతానికి ఈ కేసును అనుమానాస్పద కేసు గానే పరిగణిస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Story Board: రియల్ ఎస్టేట్లో డౌన్ ట్రెండ్ కొనసాగుతుందా? కొనుగోలు శక్తి తగ్గిపోయిందా?
2002లో షెఫాలి జరివాలా కాంటా లగా రీమేక్ సాంగ్‌తో చాలా ఫేమస్ అయ్యారు. అలాగే బిగ్ బాస్ 13లో కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా సినిమాల్లోనూ.. రియాలిటీ షోల్లోనూ పాల్గొన్నారు. సల్మాన్ ఖాన్ చిత్రం ముజ్సే షాదీ కరోగిలో షెఫాలి నటించారు. అలాగే 2019 వెబ్ సిరీస్ బేబీ కమ్ నాలో నటించారు. బూగీ వూగీ, నాచ్ బలియే వంటి ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నారు. ఆమె మరణవార్త తెలుసుకున్న అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా నటించిన 2004 చిత్రం ‘ముజ్సే షాదీ కరోగి’లో జరీవాలా కనిపించింది. 2015లో వివాహం చేసుకున్న ఆమె.. భర్త పరాగ్ త్యాగితో కలిసి ‘నాచ్ బలియే’ సీజన్ 5, 7లో కూడా కనిపించింది.
Yes Gurll You're the Only One Kaanta Laga Girl 😢💔
BiggBoss13 House Was A Cursed #SidharthShukla was At 40 and Now #ShefaliJariwala at just 42 😢
R.I.P 🙏 pic.twitter.com/ykuED3s601
— 𝐊𝐡𝐚𝐧 𓅋 (@Itsmesonu_) June 27, 2025