Hyderabad: బుద్ధిగా చదువుకోమని చెప్పడమే తల్లి అంజలి చేసిన నేరమైంది..!! కూతురు తేజశ్రీకి మాత్రం తల్లి చేష్టలు మరోలా అర్థమయ్యాయి !! మొదటి భర్తకు పుట్టిన కూతురును కాబట్టే నన్ను పట్టించుకోవడం లేదని, రెండో భర్త కూతురైన తన చల్లిపైనే ప్రేమ చూపిస్తోందని అనుకుంది తేజశ్రీ.
తల్లి కష్టం నూటికి నూరుపాల్లు కన్న కూతురే అర్థం చేసుకోగలదు. ఎందుకంటే తానూ ఆడదే కాబట్టి !! అందులోనూ తండ్రి లేని కూతురు కాబట్టి... తల్లి తమను ఎంత కష్టపడి పెంచిందో తనకు మాత్రమే తెలుసు. అలాంటి కూతురు కన్నతల్లి పాలిట శాపంగా మారింది. ఇద్దరు కుర్రాళ్లతో కలిసి తల్లిసి హత్య చేసింది. అంజలి పెద్ద కూతురు తేజశ్రీ... ఇటీవలే తొమ్మదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలో అడుగుపెట్టింది.
జీడిమెట్ల అంజలి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రేమ వ్యవహారానికి పదే పదే అడ్డొస్తుందన్న కారణంతోనే అంజలిని.. కూతురు హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో కుమార్తె సహా ఆమెకు సహకరించిన శివ, అతని తమ్ముడు యశ్వంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
DCP Suresh:హైదరాబాద్ జీడిమెట్లలో కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించిన కూతురి సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కూతురు తన ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై తాజాగా బాలానగర్ డీసీపీ సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అనేక విషయాలను వెల్లడించారు. Read Also:Shubhanshu Shukla: కుమారుడు రోదసిలోకి వెళ్తుండగా…