Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Congress Broker Government Has Drowned The Farmers Ktr

KTR: ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా.. కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ ఏమన్నారంటే..

Published Date :November 1, 2024 , 12:51 pm
By Bhanu
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం..
  • పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర..
KTR: ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా.. కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ ఏమన్నారంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

KTR: పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేటీఆర్ ప్రజలతో మాట్లాడుతూ.. పలువురు పాదయాత్రపై ప్రత్యేకంగా ఈ అంశంలో కేటీఆర్ అభిప్రాయాన్ని కోరారు. మీరేప్పుడు పాదయాత్ర చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కేటీఆర్ ఖచ్చితంగా పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. దాదాపు గంటన్నపాటు సాగిన ఈ సంభాషణలో కేటీఆర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు.

Read also: Liquor Sales: మద్యం అమ్మకాల్లో మనమే టాప్.. రెండో స్థానంలో ఎవరంటే..!

కాంగ్రెస్ పార్టీ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ..

తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశాలు ఏమాత్రం లేవు… అందుకే అబద్ధాల మీద, అసత్యాల మీద సమయం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. గత పది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదన్నారు. అబద్ధపు హామీల మీద ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేమన్నారు, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించింది అన్నారు. అయితే వీటికి భయపడేది లేదని కేటీఆర్ అన్నారు. సన్నవడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్ గా మారిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక రైతుబంధు లేక నష్టపోతున్న రైతన్నల తరఫున పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.

Read also: KA : తొలి రోజు అదరగొట్టిన కిరణ్ అబ్బవరం ‘క’..

అతిపెద్ద సవాలు- కేటీఆర్

నాలుగు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడం ఖాయమని అయితే కొత్త ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేసిన నష్టం నుంచి తెరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాలుగా మారుతుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనం అయిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయ వనరులు నుంచి మొదలుకొని వ్యవసాయ రంగం, అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. నిరుద్యోగితక పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వదిలి వెళ్ళిపోతున్నాయన్నారు. ఈ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ పాలన వలన జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం అప్పుడప్పుడే సాధ్యం కాదు అన్నారు.

Read also: Sanjiv Goenka: రాహుల్ను వదిలేసిన లక్నో.. సంజీవ్‌ గొయెంకాను ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్స్..

ప్రజల పక్షాన కోట్లాడడమే భాధ్యత..

ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడం పైన ప్రధానంగా దృష్టి సారించామని తెలిపిన కేటీఆర్, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో పాటు తీసుకున్న నిర్ణయాలలో పారదర్శకత పైన ప్రజల తరఫున కొట్లాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అప్పుడే బలమైన ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని రాజ్యాంగబద్ధంగా మార్చే అవకాశం ఉన్నదా అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిందే అన్నారు. అయితే ప్రజలు ఐదు సంవత్సరాల కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి అయిదు సంవత్సరాలు పూర్తికాలిక పదవిలో ఉంటారా లేదా ఓటుకు నోటు వలన బిజెపికి వెళ్తాడా అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజకీయాల్లో ఏదైనా జరుగుతుందని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఎప్పుడూ ఎలాంటి పరిణామాలైన జరగవచ్చు అన్నారు.

Read also: Iran-Israel: ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై ప్రతిదాడికి సిద్ధం కావాలి: ఇరాన్‌ సుప్రీంలీడర్

రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం నీచం..

మేము అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో ఏనాడు ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదన్నారు. దాదాపు రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు, రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురైన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్ధంకాదని, ఈ విషయం తనకు అత్యంత బాధ కలిగిస్తుందన్నారు. నీచమైన రాజకీయాల కోసం తన కుటుంబాన్ని లాగుతున్న ముఖ్యమంత్రి పైన, ఆయన వందిమాగదుల పైన ప్రజల మద్దతుతో పోరాటం చేస్తాను. రెేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వతా ఈ నీచమైన రాజకీయ సంస్కృతి అత్యంత హీనమైన దశలో రాష్ట్రం ఉన్నది . అయితే ఈ నీచమైన దశకూడా త్వరలో ముగిసిపోతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు.

Read also: VenkyAnil3 : సంక్రాంతికి వస్తున్న వెంకీ – అనిల్ రావిపూడి

మూసీ, హైడ్రా పైన కేటీఆర్..

చెరువుల సంరక్షణ పేరుతో ప్రభుత్వం పేపర్ మీద గొప్పలు చెబుతున్నప్పటికీ అసలైన ఎజెండా అవినీతి మాత్రమే. మూసి బ్యూటిఫికేషన్ కి మేము వ్యతిరేకం కాదు కానీ మూసి లూటిఫీకేషన్ కి వ్యతిరేకం. మూసీ ప్రక్షాళణ దేశంలోనే అతిపెద్ది అవినీతి స్కాం అవుతుందన్నారు. హైడ్రా కేవలం కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది ఇప్పటిదాకా ఒక్క పెద్ద బిల్డర్ ని కూడా హైడ్రా ముట్టుకోలేదు, కేవలం పేదలను మధ్యతరగతి ప్రజలను మాత్రమే నిర్దయగా దోచుకున్నదన్నారు .మూసీ నది ప్రక్షాళన అనేది దేశంలోనే అతిపెద్ద అవినీతి స్కామ్ గా నిలవబోతున్నది అన్నారు.

Read also: Aghori news: తెలంగాణలో హాట్ టాపిక్ గా అఘోరీ ఇష్యూ.. పోలీసుల అదుపులో నాగసాధు

వారందరూ గొప్పగా పనిచేస్తున్నారు..

ఎన్నికల్లో ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో పార్టీ మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా బాగా యాక్టివ్ గా మారారన్నారు. ఈ అంశంలో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు అనేక అంశాలను చర్చించాము. పార్టీ తరఫున ఏం ఆశించకుండానే అద్భుతంగా పనిచేస్తున్నారని, వారి మద్దతును పార్టీకీ సోషల్ మీడియా వారియర్లు అందిస్తున్నారన్నారు. ఇంత బలమైన సోషల్ మీడియా బృందాన్ని కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.త్వరలోనే ఒక విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా, కాంగ్రెస్కి మద్దతుగా వ్యవహరిస్తున్న ప్రధాన స్రవంతి మీడియాకి ప్రత్యామ్నాయం సోషల్ మీడియా మాత్రమే అన్నారు.

Read also: Gun Missfire: అనంతపురం కలెక్టరేట్‌లో వెపన్ మిస్ ఫైర్!

కేసీఆర్ ఆరోగ్యం, రాజకీయాలపై కేటీఆర్ ఏమన్నారంటే..

తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు తెలంగాణ పదం ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు నిలిచే ఉంటుందన్నారు. కెసిఆర్ గారు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన పార్టీని, తమ నాయకులందరికీ ఎప్పటికప్పుడు ఆయా అంశాల పైన మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కొత్తగా ఎన్నికైన ఈ ప్రభుత్వానికి ఇచ్చిన 420 హమీలు అమలు చేసేందుకు సరిపడా సమయం ఇచ్చారన్నారు. నూతన సంవత్సరం తర్వాత ఆయన నుంచి మరిన్ని కార్యక్రమాలను చూస్తామన్నారు.

Read also: Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో 7,994 మంది అభ్యర్థులు

పోలీసు వేధింపులపై హెచ్చరిక..

ప్రస్తుతం తమ విధులు మరిచి, చట్ట విరుద్ధంగా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులపైన రెచ్చిపోతున్న పోలీస్ అధికారులను గుర్తుపెట్టుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజకీయ వేధింపుల విషయంలో ప్రభుత్వ అధినేతలను ప్రసన్నం చేసుకునే పనుల్లో కొంతమంది పోలీసు అధికారులు బిజీగా ఉండడం వలన శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయని కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి హోంమంత్రి అవసరం ఉందన్నారు. మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించమని తెలిపారు. మతపరమైన హింస వాంఛనీయం కాదన్నారు. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరంలో నెల రోజులపాటు ఎలాంటి కారణం లేకుండా 144 సెక్షన్ విధించడం షాక్ కు గురి చేసింది అన్నారు. ఏదో అత్యంత కీలకమైన అంశం సరిగా లేకుంటేనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ అన్నారు.

Read also: Gold Prices : గుడ్ న్యూస్.. నిజమైన దీపావళి నేడే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

పార్టీ మారిన 10 మంది గురించి కేటీఆర్ ఏమన్నారంటే..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి కలిసి పని చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. అనేక అంశాలు రెండు పార్టీల నాయకులు కుమ్మకై పనిచేస్తున్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది అని తెలిపారు. ఇచ్చిన హామీలను తప్పుతున్న కాంగ్రెస్ లాంటి పార్టీల పైన చర్యలు తీసుకునేందుకు ప్రజలను పదేపదే మోసం చేయడానికి అరికట్టేందుకు బలమైన ఎన్నికల సంస్కరణలు అవసరమన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లోను జాతీయ పార్టీలను ప్రజలు నమ్మవద్దని అక్కడి స్థానిక పార్టీలకు ఓటు వేయాలన్నారు. తమిళనాడు విజయ్ దళపతి ప్రారంభించిన రాజకీయ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయపరమైన అంశాల పట్ల విభేదాలే తప్ప తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకులందరితో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉన్నదన్నారు. ప్రజలే సాధారణ వ్యక్తులను నేతలుగా తయారు చేస్తారని తన నమ్మకం అన్నారు బీఆర్ఎస్ పార్టీ బలంగా తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు.

Read also: Vishwam : చడీ చప్పుడు లేకుండా ఓటీటీలో దిగిన ‘విశ్వం’

బీఆర్ఎస్ పార్టీ కుటుంబం, తన స్నేహితులు, కుటుంబ సభ్యుల వల్లనే తనకు నిత్యం స్ఫూర్తి అభిస్తుందన్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండే అవకాశం వలన మాకు నిబద్ధత కలిగిన, బలమైన నూతన నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశం ఇచ్చింది. నిజం కన్నా పర్సెప్షన్, పీపుల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని గత ఎన్నికల ఓటమి మాకు నేర్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీలు ప్రజల్లో అవాస్తవికమైన ఆశల్ని రేకెత్తించాయని, రెండుసార్లు వరుసగా గెలవడంతో యాంటీ ఇన్ కంబెన్సీ కూడా తమ ఓటమి విషయంలో కొంత ప్రభావం చూపిందన్నారు. పార్టీ మారిన 10 మంది అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం బిజెపి చేస్తున్న మరొక జుమ్లా అయి ఉంటుందని, అయితే వారు తీసుకువచ్చే చట్టం ఎలాంటిదో చూడాల్సిన అవసరం ఉందన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది అసాధ్యం అని తెలిపారు. గ్రూప్ వన్ అభ్యర్థుల తన పూర్తి మద్దతు ఉంటుందన్న కేటీఆర్, పార్టీ తరఫున వారికి అండగా ఉంటామన్నారు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకువస్తామన్నారు.
Astrology: నవంబర్ 1, శుక్రవారం దినఫలాలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • According to the aspirations
  • BRS
  • ktr
  • march across the state..
  • party workers

తాజావార్తలు

  • Dhurandhar 2: దురంధర్ నటుల్ని భలే పట్టారే.. రీల్ vs రియల్ పిక్స్ మీకోసం!

  • Gas Supply : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరట

  • Indian Rupee Falls: ఒక్క రోజులో భారీ పతనం.. రూపాయి పడిపోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే..

  • Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.

  • Aakash Chopra: “కోట్లు పెట్టి కొంటే హ్యాండ్ ఇస్తారా?”.. ఐపీఎల్‌లో విదేశీ ప్లేయర్స్‌ తీరుపై ఆకాష్ చోప్రా ఫైర్

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions