మంత్రుల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జి మంత్రులదే అని స్పష్టం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ మీ దగ్గరే ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలపై ఇన్‌ఛార్జి మంత్రులు దృష్టిపెట్టడం లేదని.. ఇది కరెక్ట్ కాదన్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే జిల్లాలో పదవులు భర్తీ చేయాలని సూచించారు. కార్యకర్తలను నారాజ్ చేయకండని పిలుపునిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, ఈనెల 21న, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం, ఆరోజు కార్యక్రమంలో అందరూ మమేకం కావాలని కోరింది.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై.. ఏడాది మా పాలనపై చర్చకు మేం సిద్ధమని పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అన్నారు. ఫార్మా సిటీ ఒక్క చోట ఉండొద్దు అనే.. వికేంద్రీకరణ చేశామని ఆయన తెలిపారు.
Arvind Kejriwal: ఫిబ్రవరి 2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వీడియో సందేశం ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలు హృదయపూర్వకంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి కొన్ని నెలల పాటు సెలవులు తీసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలను కోరారు. బయటి నుంచి వచ్చిన కార్యకర్తలు ఢిల్లీలోని…
KTR: పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేటీఆర్ ప్రజలతో మాట్లాడుతూ.. పలువురు పాదయాత్రపై ప్రత్యేకంగా ఈ అంశంలో కేటీఆర్ అభిప్రాయాన్ని కోరారు. మీరేప్పుడు పాదయాత్ర చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కేటీఆర్ ఖచ్చితంగా పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. దాదాపు గంటన్నపాటు సాగిన ఈ సంభాషణలో కేటీఆర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. Read also:…