Gold Prices : గత కొంతకాలంగా బంగారం ధరలు రోజురోజుకి పెరుగూతూనే ఉన్నారు. సరికొత్త రికార్డులకు చేరుతూ సామాన్యులకు అందనంత దూరానికి వెళ్తున్నాయి. ఇప్పటికే రూ.80 వేల మార్కును బంగారం దాటేసింది. వరుసగా మూడు రోజులు పెరిగిన పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు బంగారం ధరలు తులం 770లు తగ్గింది. హైదరాబాదులో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 80,560గా నమోదైంది. అలాగు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.700 తగ్గి 73,850గా నమోదైంది.
Read Also:Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో 7,994 మంది అభ్యర్థులు
మరోవైపు ఈరోజు వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్ లో ఒక గ్రాము వెండి ధర రూ. 106 గానూ, 8 గ్రాముల వెండి ధర రూ. రూ. 848 గానూ ఉంది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 1,060 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ కిలో వెండి ధర రూ. 3,000 తగ్గి రూ. 1,06,000 గా ఉంది. ఏపీలోని విజయవాడలో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ. 7,385 గానూ, 8 గ్రాముల బంగారం ధర రూ. 59,080 గానూ ఉంది. అలాగే 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 73,850 గానూ ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఈరోజు 10 గ్రాముల పసిడి ధర రూ. 700 తగ్గింది.
Read Also:Karthika Masam 2024: కార్తీక మాసం విశేషాలు.. మొదలయ్యేది ఎప్పటి నుంచి అంటే..