CM Revanth Reddy: నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
- నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
- హాజరుకానున్న ఎన్డఆర్ఎఫ్, సింగరేణి, ఎన్‌జీఆర్‌ఐలకు చెందిన అధికారులు..
- టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేసే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు (మార్చ్ 24) సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే సమీక్షకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్‌జీఆర్‌ఐ, సింగరేణితో పాటు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సరిగ్గా నెల క్రితం ప్రమాదం జరిగి.. 8 మంది చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి.. కేవలం, గురుప్రీత్‌సింగ్ (పంజాబ్) మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి.
Read Also: Hyderabad MMTS: హైదరాబాద్‌లో ఘోరం.. ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం
Also Read
- Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
- Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
- Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
- CM Revanth Reddy : పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు TOMCOMదే బాధ్యత
కాగా, ఇప్పటి వరకు మరో ఏడుగురి మృతదేహాలు మాత్రం లభ్యం కాలేదు. అయితే, నేటి సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం రేవంత్ దిశానిర్దేశనం చేసే అవకాశం ఉంది. మరోవైపు సహాయక చర్యల కోసం రూ.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండటంతో.. పాటు టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్ గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. ఇక, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమని సిబ్బంది తేల్చి చెప్పాయి. కాగా, టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ ఎపిసోడ్ పై ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!