South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
- మౌలాలి వద్ద OHEలో సాంకేతిక లోపం
- శాతవాహన, పల్నాడు, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లకు అంతరాయం
- డీజిల్ ఇంజిన్లతో రైళ్లను ముందుకు తరలింపు
- కాకతీయ ఎక్స్‌ప్రెస్ రూట్ మళ్లింపు.. స్టాప్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విద్యుత్ మార్గంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తడంతో పలు కీలక రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఓవర్‌హెడ్ ఎక్విప్మెంట్ (OHE) వ్యవస్థలో హఠాత్తుగా సమస్య ఉత్పన్నం కావడంతో సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వైపు వెళ్లే ప్రధాన రైళ్లు నిలిచిపోయాయి. దీంతో వివిధ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గంటల తరబడి నిలిచిపోయిన శాతవాహన, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు
మౌలాలి స్టేషన్ దాటిన వెంటనే ఓవర్‌హెడ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శాతవాహన ఎక్స్‌ప్రెస్ దాదాపు గంటకు పైగా మార్గమధ్యంలోనే ఆగిపోయింది. ఈ ప్రభావంతో వెనుక వస్తున్న పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను మౌలాలి స్టేషన్ వద్దనే అత్యవసరంగా నిలిపివేశారు. అదే సమయంలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరాల్సిన విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కూడా అధికారులు ప్లాట్‌ఫారమ్‌పైనే నిలిపివేసారు. ప్రధాన మార్గంలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.
Also Read
డీజిల్ ఇంజిన్‌తో తాత్కాలిక పునరుద్ధరణ.. యుద్ధప్రాతిపదికన పనులు
విద్యుత్ లైన్లలో తలెత్తిన లోపాన్ని గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. శాతవాహన ఎక్స్‌ప్రెస్‌తో పాటు మౌలాలి వద్ద నిలిచిపోయిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు డీజిల్ ఇంజిన్లను అమర్చి, వాటిని తాత్కాలికంగా ముందుకు కదిలించి ట్రాక్‌ను క్లియర్ చేశారు. ప్రస్తుతం ఓవర్‌హెడ్ ఎక్విప్మెంట్ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు రైల్వే ఇంజనీరింగ్ బృందాలు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నాయి. చాలావరకు సమస్యను అధిగమించామని, పనులు త్వరలోనే పూర్తయి రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ వెల్లడించింది.
కాకతీయ ఎక్స్‌ప్రెస్ రూట్ మళ్లింపు.. మౌలాలిలో స్టాప్ రద్దు
ఈ సాంకేతిక సమస్య , పునరుద్ధరణ పనుల నేపథ్యంలో రైలు నంబర్ 17659 సికింద్రాబాద్–భద్రాచలం రోడ్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని అధికారులు మళ్లించారు. ఈ రైలును మల్కాజ్గిరి మార్గం మీదుగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మార్గం మళ్లింపు కారణం వల్ల ఈ రైలుకు మౌలాలి రైల్వే స్టేషన్లో నిర్ణయించిన క్రమబద్ధమైన స్టాప్ ఉండదని, ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
-
Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
-
Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
-
Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
-
RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?