LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
- LPUలో విద్యార్థుల ఆందోళన హింసాత్మకం
- విద్యార్థులు, పంజాబ్ పోలీసుల మధ్య ఘర్షణ
- పలువురు పోలీసులకు గాయాలైనట్లు ఎస్ఎస్పీ వెల్లడి
- విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలతో అట్టుడుకుతున్న వర్సిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPU Students Protest: పంజాబ్‌లోని ఫగ్వారా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఒక విద్యార్థినిపై యూనివర్సిటీ బయట వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా నిరసన చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యూనివర్సిటీలోని కిటీల అద్దాలు పగలగొట్టడంతో పాటు కొన్ని వస్తువులకు నిప్పుపెట్టారు. ఆదివారం సాయంత్రం కూడా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ ఘర్షణలు విద్యార్థులు, పోలీసులకు మధ్య ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయని జలంధర్ ఎస్ఎస్పీ హర్విందర్ సింగ్ విర్క్ తెలిపారు. పలు పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయని, కొన్నింటికి నిప్పు పెట్టారని తెలుస్తోంది.
Also Read
- Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
- Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
ఈ ఉద్రిక్తతలు శనివారం రాత్రి నుంచే నెమ్మదిగా మొదలయ్యాయి. క్యాంపస్‌లో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ సోషల్ మీడియాలో సమాచారం వ్యాపించింది. ఈ వార్తలతో భారీ సంఖ్యలో విద్యార్థులు బాలికల హాస్టల్ సమీపంలో గుమిగూడారు. ఈ ఘటనపై ఎలాంటి ఆధారాలు, ఫిర్యాదులు అందలేదని ముందుగా పోలీసులు చెప్పారు. యూనివర్సిటీ వర్గాలు కూడా ఈ ఘటనను తోసిపుచ్చాయి.
ఇదిలా ఉంటే, ఆ తర్వాత పోలీసులు విద్యార్థిని వాంగ్మూలం తీసుకుని, కేసు నమోదు చేశారు. ఘటనపై సిట్ ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ ఆధారాలు, CCTV ఫుటేజ్, ఫోన్ డేటాను పరిశీలించనున్నట్లు జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా తెలిపారు. ఈ దర్యాప్తులో విద్యార్థి ప్రతినిధుల్ని కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
-
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?