KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
- చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో భారీ వసూళ్లు
- 44 మందికి పైగా బాధితులని ఆరోపణ
- ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఇంటికి తాళాలు
- రంగంలోకి దిగిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన భారీ చిట్టీల మోసం తీవ్ర కలకలం రేపుతోంది. చిట్టీలు , అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజల నుంచి దాదాపు రూ. 16 కోట్లకు పైగా వసూలు చేసిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి పరారయ్యారు. కేపీహెచ్‌బీ ప్రాంతానికి చెందిన రమణారెడ్డి, ఆయన భార్య సీత, కుమార్తె హరీషా రెడ్డి కలిసి దాదాపు 44 మందిని నమ్మించి ఈ భారీ దగాకు పాల్పడినట్లు బాధితులు వాపోతున్నారు.
ఫోన్లు స్విచ్ ఆఫ్.. రంగంలోకి దిగిన ఈఓడబ్ల్యూ
బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చేసరికి నిందితులు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి, నివాసానికి తాళాలు వేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఈ ఆర్థిక నేరం యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ – EOW) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల బ్యాంక్ ఖాతాలు, వారి కాల్ డేటా ఆధారంగా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు వేగవంతం చేశాయి.
Also Read
- Hyderabad : పండుగ వేళ 'తీపి' విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!
- ED Raids: రూ. 326 కోట్ల బ్యాంక్ మోసం కేసు.. హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు
- Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
- Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
‘కూతుళ్ల పెళ్లిళ్ల కోసం దాచుకున్నాం’.. కన్నీరుమున్నీరవుతున్న బాధితులు
రమణారెడ్డి కుటుంబంతో తమకు సుదీర్ఘకాలంగా పరిచయం ఉందని, ఆ నమ్మకంతోనే కష్టపడి సంపాదించిన సొత్తును వారి వద్ద చిట్టీల రూపంలో దాచుకున్నామని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కొందరు తమ కుమార్తెల వివాహాల కోసం, మరికొందరు ఇళ్ల నిర్మాణాల కోసం కూడబెట్టిన కష్టార్జితాన్ని వీరి చేతుల్లో పెట్టి ఇప్పుడు వీధిపాలయ్యారు. క్షేత్రస్థాయిలో బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని, తమ అందరికీ కలిపి నిందితుల నుంచి రావలసిన మొత్తం దాదాపు రూ. 70 కోట్ల వరకు ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను అరెస్ట్ చేసి తమ సొమ్మును రికవరీ చేయాలని వేడుకుంటున్నారు.
తాజావార్తలు
-
Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
-
Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్‌డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
-
Hyderabad : పండుగ వేళ ‘తీపి’ విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!
-
Rukmini Vasanth : మరో మంచి చాన్స్ పట్టేసిన రుక్కు!
-
UP MLC Polls: ‘‘నమ్మకం పోయింది, ఇస్లాంలోకి మారుతా’’.. కన్నీళ్లు పెట్టుకున్న యూపీ ఎస్పీ అభ్యర్థి..
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!