Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ , వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఓటమి అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తీవ్ర నిరాశతో మాట్లాడారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము చేసిన తప్పిదాలను, ప్రత్యర్థి ఆటతీరును ప్రస్తావించారు. మేము మొదట బ్యాటింగ్ చేసే సమయంలో బోర్డుపై ఇంకా మెరుగైన పరుగులు ఉంచి ఉండాల్సిందని, సరిగ్గా చెప్పాలంటే మేము కనీసం 60 నుంచి 80 పరుగులు తక్కువ చేశామని ఆయన బాధగా చెప్పారు.
మా ఓపెనర్లు నిజంగానే చాలా బాగా ఇన్నింగ్స్ ప్రారంభించారని, జట్టుకు ఒక పటిష్టమైన పునాదిని వేశారని ఆయన కొనియాడారు. కానీ ఆ తర్వాత మిగతా బ్యాటర్లు మధ్య ఓవర్లలో పూర్తిగా తడబడ్డారని, రన్స్ చేయలేక ఇబ్బంది పడ్డారని తెలిపారు. క్రికెట్లో కీలకమైన క్షణాలను మన వైపు తిప్పుకోవడంలో విఫలమయ్యామని, అదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందని వాపోయారు. అంతేకాకుండా.. ఫీల్డింగ్‌లో తమకు దక్కిన కొన్ని సులభమైన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయినట్లు ఆయన అంగీకరించారు. ఈ ఓటమి నుంచి తగిన పాఠాలు నేర్చుకుని రాబోయే మ్యాచ్‌లలో మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తామని షాయ్ హోప్ స్పష్టం చేశారు.
Also Read
- Chairman's Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
- Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
- Off The Record: సూర్యాపేట కాంగ్రెస్ ను ముంచుతున్న గ్రూప్ వార్..!
- CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
ఈ మ్యాచ్‌లో భారత యువ సంచలనం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ , రికార్డుల వీరుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరు అద్భుతం అని కొనియాడారు. వారు క్రీజులో కుదురుకుని ఆడిన తీరు తమ బౌలర్లను పూర్తిగా నిరుత్సాహపరిచిందని ఆయన అన్నారు. గిల్ అద్భుతమైన శతకంతో జట్టును ముందుండి నడిపిస్తే, కోహ్లీ మాత్రం తన అనుభవంతో స్టేడియం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడని, వారిద్దరి భాగస్వామ్యం తమ జట్టును మ్యాచ్‌కి దూరం చేసిందని తెలిపారు.
మరోవైపు భారత బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ చాలా అద్భుతంగా బౌలింగ్ వేసి తమ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని ఆయన ప్రశంసించారు. తాము మ్యాచ్‌లో ఒక మోస్తరుగా మంచి స్కోరు సాధించినప్పటికీ, భారత బ్యాటర్ల జోరు ముందు ఆ స్కోరు ఏ మాత్రం సరిపోలేదని షాయ్ హోప్ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ ఓటమి తమకు ఒక పెద్ద కనువిప్పు అని, తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన వ్యూహాలతో బరిలోకి దిగుతామని ఆయన ముగించారు. మా ఓటమిని కోహ్లీ, గిల్, కుల్దీప్ యాదవ్‌లే ఓటమికి కారణమన్నారు.
తాజావార్తలు
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
-
Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!