GST Scam Case: తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులు రూ. 1000 కోట్ల అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ ఆడిట్ లో 75 కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. మార్షల్ ట్యాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు పలువురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఈ నెల 26న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఏ-5గా చేర్చారు.
Read also: Teacher Sleeping In School: ఈ టీచరమ్మ రూటే సపరేటు.. నిదురపోతున్న ఆమె పిల్లలతో? (వీడియో)
అప్పట్లో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా ఉన్న సోమేశ్ కనుసన్నల్లో హైదరాబాద్ ఐఐటీ రూపొందించిన సాఫ్ట్ వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులను పక్కదారి పట్టించి ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదు మేరకు అదనపు కమిషనర్ (సేల్స్ ట్యాక్స్) ఎస్సీ కాశీ విశ్వేశ్వరరావు (ఏ-1), డిప్యూటీ కమిషనర్ శివరామ్ ప్రసాద్ (ఏ-2), ప్రొఫెసర్ శోభన్ బాబు (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ హైదరాబాద్), ప్లియాంటో టెక్నాలజీస్ (A-4)ని నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 406, 409, 120-బి, ఐటీ చట్టంలోని సెక్షన్ 65 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Read also: CM Revanth Reddy: నేడు రాష్ట్ర నూతన గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
మరోవైపు ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. విచారణలో భాగంగా రూ.450 కోట్ల కుంభకోణం జరిగినట్లు స్పష్టమైంది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా లబ్ధిదారులేనని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకే శోభన్ బాబు సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసినట్లు పోలీసులకు అర్థమైంది. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నుంచి ఫిర్యాదు అందిందని, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ సహా ఐదుగురిపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి మీడియాకు తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
China Floods : చైనాలో భారీ వర్షాలు.. 15 మంది మృతి, ఆరుగురికి గాయాలు