PM Modi: కాంగ్రెస్ బట్టలు చింపుకోవడం తప్పితే, చేసేదేం లేదు..
- కాంగ్రెస్ దేశ వ్యతిరేకుల చేతిలో ‘‘కీలు బొమ్మ’’..
- ఆ పార్టీ బట్టలు చింపుకోవడం తప్పితే వేరే మార్గం లేదు..
- అస్సాంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అస్సాం ఎన్నికల ప్రచారంలో శనివారం పాల్గొన్నారు. సిల్చార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మధ్య భారతీయుల్లో ఆందోళనల్ని పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే, ప్రభుత్వం ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేందుకు కృషి చేస్తుందని అన్నారు.
భారతదేశ అభివృద్ధిని వ్యతిరేకించే శక్తుల చేతుల్లో కాంగ్రెస్ ‘‘కీలుబొమ్మ’’గా మారిందని ప్రధాని ఆరోపించారు. ‘‘మన దేశ పౌరులు సాధ్యమైనంత తక్కువ కష్టాలను ఎదుర్కొనేలా చూసుకోవడానికి మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ యుద్ధం దేశ పౌరులపై ప్రభావాన్ని తగ్గించడమే మా లక్ష్యం. ఈ కీలక సమయంలో, కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా తన పాత్రను నిర్వర్తిస్తుందని భావించారు. అయితే, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన ఈ కీలకమైన పనిలో కాంగ్రెస్ మరోసారి విఫలమైంది’’ అని దుయ్యబట్టారు.
Also Read
దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని, తద్వారా వారు తనపై దుర్భాషలాడొచ్చని మోడీ అన్నారు. భాత్ వేగంగా అభివృద్ధి చెందడాన్ని జీర్ణించుకోలేని శక్తుల చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ను అస్సాంలో తుడిచిపెట్టేశారని, త్వరలో వందేళ్ల పరాజయాలను చవిచూడబోతోందని ప్రధాని సెటైర్లు వేశారు. దేశంలోని ప్రతీ రాష్ట్రం కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పుతుందని అన్నారు. నిరాశతో కాంగ్రెస్ బట్టలు చింపుకోవడం తప్పితే, వారికి వేరే మార్గం కనిపించడం లేదని ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనల్ని ప్రస్తావిస్తూ ప్రధాని విమర్శించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!