Harish Rao: మహిళకు ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు తప్ప అన్ని తుస్సు మన్నాయని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో ఆలయ్ బలయ్ ధూమ్ దాం లో హరీష్ రావు పాల్గొన్నారు. పథకాల పాలన పోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చే ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు రైతులను ప్రజలను మహిళలను మోసం చేసిందన్నారు. కరోనా లాంటి మహమ్మారి వచ్చిన వ్యాపించిన సమయంలో కూడా రైతులను కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నదన్నారు. కేసీఆర్ పాలనలో 11 సార్లు 72 వేల కోట్ల రూపాయలు రైతు బందు రైతులకు ఇచ్చినం అన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం 25 వేల రూపాయలు బాకి ఉన్నదని మహిళకు గ్రామగ్రామాన వివరించాలన్నారు. ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి, మన సీఎం చీటింగ్ సీఎం అని కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాలలో లైట్లు వేసేందుకు పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఓట్లు పెట్టిండన్నారు.
Read also: Group-1 Candidates: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో విద్యార్థులు
మా పాపత్మ ముఖ్యమంత్రిని క్షమించు అని నేను యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దండం పెట్టీ కోరిన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇంతో అంత వస్తున్నాయి అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే అన్నారు. మహిళకు ఇచ్చిన హామీలలో ఒక ఉచిత బస్సు తప్ప అన్ని తుస్సుమన్నాయన్నారు. రాహుల్ గాంధీ ని తీసుకువచ్చి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. గ్రూప్1 ఉద్యోగాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ,ఎస్సి, ఎస్టి, మైనారిటీ పిల్లలను మోసం చేస్తున్నారన్నారు. ఒక పక్క దేశంలో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ప్రజలకు అంతా అర్థమతుందన్నారు. మూసీ నదిలో పేదలకు అన్యాయం జరిగితే చావడానికైన సిద్ధంగా ఉన్నామన్నారు. తనని, కేటీఆర్ ను బుల్డోజర్లతో తొక్కిస్త అంటున్నాడు.. ఆయన తాటాకు చప్పట్లకు బీఆర్ఎస్ నాయకులు ఎవరు భయపడరన్నారు. మా కార్యక్తలపై అక్రమ కేసులు పెట్టీ వేధిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదన్నారు. పోలీస్ అఫీసర్లకు ఒక్కటే చెపుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదన్నారు.
Kunamneni Sambasiva Rao: రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం.. కూనంనేని కీలక వ్యాఖ్యలు