ఐటీ రాజధాని హైదరాబాద్, గచ్చిబౌలి లో సరికొత్త షోరూమ్ ద్వారా తన రిటైల్ బ్రాండ్ విస్తృతిని పెంచుతున్న ఆర్.ఎస్. బ్రదర్స్ ! ఆర్.ఎస్. బ్రదర్స్ మరో మైలురాయిని అధిగమిస్తోంది. నవంబర్ 27వ తేదీనాడు తన 16వ షోరూమ్ ను హైదరాబాద్ గచ్చిబౌలిలో శుభారంభం చేస్తోంది. పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి, ప్రసాద్ రావు, దివంగత పి. సత్యనారాయణ స్థాపించిన ఈ సంస్థ తన విజయవంతమైన రిటైల్ ప్రస్థానంలో ఒక విశిష్టమైన బ్రాండు గా చరిత్ర సృష్టించి. అటు సంప్రదాయాన్నీ,…
పట్ట పగలే కత్తులు, బ్యాట్ లతో సినీ నటి రమ్య శ్రీ, ఆమె సోదరుడిపై దాడి చేశారు కొంతమంది దండగులు. ఈ రోజు హైదరాబాద్ - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. కాలనీ లే అవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టింది హైడ్రా. ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్టు సమాచారం.
Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌లోని పలు పబ్‌లలో ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ రఫ్ పబ్, ఫ్రూట్ హౌస్ లో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్‌లోని యువత మత్తులో జోగుతున్నారు.
IT Company Fraud: హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో బోర్డు తిప్పేసిన కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేశారు.. అయితే, కనీసం ఆఫీస్ కూడా ఏర్పాటు చేయకుండానే.. నిరుద్యోగులకు కేటుగాళ్లు ఎర వేశారు.
Software Job: మన సమాజంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఓ మోజు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అంటేనే ఊళ్లలో, బంధువుల్లో గౌరవం. చివరకు వివాహం సంబంధాల్లో కూడా ఐటీ ఎంప్లాయ్ అంటేనే ముద్దు. ఇలాంటి పరిస్థితుల్లో, యువత ఐటీ జాబ్ సంపాదించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కొడుకు హైదరాబాద్, బెంగళూర్ లేదా వీలైతే విదేశాల్లో ఐటీ జాబ్ చేయాలనే కలలు కంటున్నారు. ఈ ఆశల్ని కొందరు మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఉద్యోగాల పేరిట చాలా…
HYDRA : హైదరాబాద్ నగరంలో హైడ్రా బలగాలు మరోసారి భారీగా కూల్చివేతల దాడులు చేపట్టాయి. ఈ సారి గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని మినీ హాల్, ఫుడ్ కోర్ట్స్‌తో పాటు అనేక అనుమతులు లేని నిర్మాణాలను తొలగించారు. ఉదయం నుంచే మూడు భారీ హిటాచ్ బుల్డోజర్ల సహాయంతో కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు ఘటనా స్థలంలో బందోబస్తును ఏర్పాటు చేసి, ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈ కూల్చివేతలు ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా…
గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అమెరికా వీసా కోసం కాన్సులేట్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే సికింద్రాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో పాస్పోర్ట్ రెన్యువల్ కి సంబంధించిన లీగల్ టీమ్ సమర్పించారు.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా అమెరికన్ కాన్సులేట్ కి చేరుకున్నారు.. కేసీఆర్ తో పాటు జోగినపల్లి సంతోష్, జీవన్ రెడ్డి ఉన్నారు..
మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్ అయ్యారు.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపినాథ్ అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏపీకి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. తాజాగా అరెస్ట్ చేసింది.
HCU Lands Issue: హైదరాబాద్ నగరంలోని కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో విచారణకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ హాజరయ్యారు. ఈసందర్భంగా హెచ్సీయూ భూముల విషయంలో తప్పుడు పోస్టులు పోస్ట్ చెయ్యడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.