పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సమయంలోనే రాజేంద్రనగర్‌లోని మైలర్‌దేవ్ పల్లిలో మరొక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.. ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరించి టెర్రస్ పైకి వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు.. ఇక్కడ కూడా ఫైర్ సిబ్బంది సకాలంలో అక్కడికి వెళ్లి 20 మంది పిల్లలతో పాటు 31 మంది పెద్దలను రక్షించారు.. పాతబస్తీ గుల్జార్ హౌజ్ 17 మంది ప్రాణాలు పోతే అక్కడ 24 మందిని అధికారులు కాపాడారు..
ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లికి చెందిన సోను (21) డిగ్రీ స్టూడెంట్. హౌసింగ్ బోర్డ్ కాలనీ, బృందావనం కాలనీకి చెందిన అంబిక (21) ఎల్‌ఎల్‌బీ స్టూడెంట్. ఇద్దరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.
ATM Robbery Case: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో ఏటీఎం చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఏటీఎం చోరీకి ప్రయత్నించిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తేలింది.
Atrocious: కుటుంబాలపై ప్రేమ తగ్గుతుంది. ఇప్పుడు అందరికి కావాల్సింది మణి. డబ్బు వుంటేనే ఏదైనా. బతకడానికి కష్టపడ కుండా చేతిలో మణి వుంటే దునియాన్నే ఏలేయొచ్చనే ఆశ.
Mailardevpally Wall Collapse: హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి కురిసిన చిన్న వర్షానికి పాత గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. మృతులను బిహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై డీఆర్ఆర్ టీం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి సీఐ మధు సహా చిన్నారుల తల్లిదండ్రులు స్పందించారు. ఎన్టీవీతో డీఆర్ఆర్…
హైదరాబాద్ శివారులో పేలుడు కలకలం సృష్టించింది.. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్‌లో చెత్త కుండీలో పేలుడు సంభవించింది… ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆనంద్ నగర్‌లో చెత్త సేకరించేందుకు రంగముని సుశీలమ్మ, ఆమె భర్త ఆనందనగర్ పారిశ్రామిక వాడలకు ఉదయం ఆటోలో వెళ్లారు.. అయితే, చెత్త సేకరిస్తున్నండగా పేలుడు జరిగింది.. ఈ ఘటనలో సుశీలమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..…