Hyderabad: నగరంలో గత కొంత కాలంగా స్కూల్ బస్సు కింద పడి చిన్నారులు మృతి చెందిన వార్తలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో హయత్ నగర్ లో ఓ మూడేళ్ళ చిన్నారి అక్కను బస్సు ఎక్కించడానికి తాతయ్య తో కలిసి వచ్చి బస్సు కింద పడి మరణించారు. ఆ ఘటన మరవక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. సోదరుడిని స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చిన 3 ఏళ్ళ చిన్నారి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మరణించింది. ఈ ఘటన హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో చోటు చేసుకుంది, విబువారాలోకి వెళ్తే.. భవిష్య అనే 3 ఏళ్ళ చిన్నారి కుటుంబం హైదరాబాద్ లోని జవహర్ నగర్ ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనిలో నివాసం ఉంటుంది.
Read also:Minister Adimulapu Suresh: నేను మంత్రిగా ఉన్నానంటే అది జగన్ పుణ్యమే..
కాగా భవిష్య సోదరుడు రచన గ్రామర్ హైస్కూల్ లో చదువుతున్నాడు. కాగా ప్రతి రోజు లానే స్కూల్ కి వెళ్లేందుకు స్కూల్ బస్సు దగ్గరకి వస్తున్న సోదరుడితో కలిసి బస్సు దగ్గరకి వచ్చింది భవిష్య. ఈ క్రమంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు రచన గ్రామర్ హైస్కూల్ బస్సు ముందు చక్రాల కింద పడింది భవిష్య. దీనితో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనకు కారణం బస్సు డ్రైవర్ ప్రవీణ్ నిర్లక్ష్యమే అని స్థానికులు భావిస్తున్నారు. కాగా స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ సంఘటన గురించి దర్యాప్తు చేస్తున్నారు.