Minister Adimulapu Suresh: నేను ఈ రోజు మంత్రిగా ఉన్నానంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుణ్యమే అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా 16వ రోజు కర్నూలు జిల్లా పత్తికొండలో ఆ బస్సు యాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓట్లకోసమే వాడుకున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఆర్థిక, విద్య, వైద్య, రాజకీయ, సామాజిక, సాధికారతలో న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ హయాంలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవర్గాలకు సామాజిక సాధికారత దక్కిందని స్పష్టం చేశారు. నేను మంత్రిగా ఉన్నానంటే అది జగన్ పుణ్యమేనన్న ఆయన.. డిప్యూటీ సీఎం, మంత్రి పదవులు.. మైనార్టీ, బీసీలకు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే అన్నారు. మంచి జరిగి ఉంటేనే మరోసారి వైఎస్ జగన్ ను ఎన్నుకోండి అంటూ పిలుపునిచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Read Also: Kotha Manohar Reddy: మహిళలతో కలిసి గడప గడపకు ప్రచారం చేసిన కొత్త మనోహర్ రెడ్డి సతీమణి
కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర 16వ రోజుకు చేరింది.. విశాఖపట్నం జిల్లా విశాఖ తూర్పు నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ రోజు వైయస్సార్ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో కొనసాగుతున్నాయి.. ఒకేసారి మూడు ప్రాంతాల్లో సాగుతోన్న ఈ యాత్రల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన లబ్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు నేతలు.