తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. గురువారం ఆరో రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం అన్నట్టుగా సభ నడింది. సీఎం రేవంత్ రెడ్డికి ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ మధ్య మాటల యుద్దం నడిచింది. కాగా సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. తాము ఎవరికి భయపడేది లేదని, కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ అక్బరుద్దీన్ ఎంత సేపు మాట్లాడినా తమకు ఇబ్బంది లేదంటూ ధీటుగా…
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఆయన పాతబస్తీ అభివృద్ధితో పాటు అక్కడ చేపట్టే సంక్షేమం వంటి కార్యక్రమాలపై చర్చించినట్టు సమాచారం. అలాగే మూసీ అభివృద్ధి పనులపై కూడా రేవంత్ రెడ్డి చర్చించారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి గ్రేటర్ ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి ముందు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాజీ సీఎం సీఎం కేసీఆర్‌ను…
చాప్రౌలీ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న ఎంఐఎం అభ్యర్థి అనీస్ అహ్మద్‌కు మద్దతుగా అసరా గ్రామంలో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నాడు మహాత్మాగాంధీని హత్య చేసిన వారే ఇప్పుడు తనపైనా దాడి చేశారని అన్నారు. తాను వాస్తవాలు మాట్లాడుతుండడం, బీజేపీ కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం చేస్తుండడంతోనే తనపై కాల్పులు జరిపారని ఆయన మండిపడ్డారు. తనపై కాల్పులు జరిపిన వారే గాంధీ హత్య వెనక కూడా…
మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హపూర్- ఘజియాబాద్ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ‘చిజారసీ టోల్‌ప్లాజా వద్ద నా కారుపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ముగ్గురు, నలుగురు దుండగులు కాల్పులు జరిపి, ఆయుధాలు వదిలేసి పరారయ్యారు. కారు…