స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరికీ తెలిసిందే. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది.

స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోల సరసన నటించి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈ భామ నటించింది. కెరీర్ పీక్‌లో ఉండగానే గౌతం కిచ్లుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.

కరోనా కాలంలో కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్‌ బాబుని కని కుటుంబ జీవితం గడుపుతోంది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అదే విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్ట్‌లు పెడుతోంది. ఈ క్రమంలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాజల్ బ్లాక్ డ్రెస్ లెహంగా వేసుకోకుండా స్టన్నింగ్ లుక్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని చూసిన నెటిజన్లు ఇంత హాట్ గా ఉంటే భరించడం కష్టమే.. దయచేసి ఏసీ పెట్టండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

అలాగే బ్లాక్ డ్రస్ లో మిమ్మల్ని ఎవరూ ఓడించలేరంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.