Serial Killer: సీరియల్ కిల్లర్ అరెస్ట్.. 12 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Police Arrested Serial Killer Praveen: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్ పల్లిలో తీవ్ర కలకలం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. సైకో కిల్లర్ ఆట కట్టించారు. హత్యలు జరిగిన 12 గంటల్లోనే హంతకుడ్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ సైకో కిల్లర్‌ని మైలార్‌దేవ్ పల్లి లక్ష్మీగూడ రాజీవ్ గృహ కల్పకు చెందిన ప్రవీణ్‌గా గుర్తించారు. నేతాజీ నగర్, దుర్గానగర్ చౌరస్తా, కాటేదాన్‌లో జరిగిన మూడు హత్యల్ని తానే చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. త్రాగిన మైకంలో నిద్రిస్తున్న వారే అతని టార్గెట్. బండరాయి తలపై వేసి, సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోవడమే ఈ సైకో కిల్లర్ స్టైల్. రాజేంద్రనగర్‌లో ఇదే తరహాలో హత్య చేశాడు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లోనూ ఇతనిపై హత్యకేసు నమోదైంది. అయితే.. మూడు హత్యలు జరిగాక, ఈ కేసుని పోలీసులు సీరియస్‌గా తీసుకొని, 12 గంటల్లోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
Train Accident: లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కోచ్ లో భారీ మంటలు.. భయంతో పరుగుతీసిన ప్రయాణికులు
Also Read
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
ఈ కేసు వివరాల్ని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. మైలార్‌దేవ్ పల్లిలో ట్రిపుల్ మర్డర్ కేసులో ప్రవీణ్‌ని అరెస్ట్ చేశామని, తాగిన మైకంలో నిద్రిస్తున్న వారినే అతడు టార్గెట్ చేస్తుంటాడని చెప్పారు. హంతకుడ్ని సైకో ప్రవీణ్‌గా గుర్తించామన్నారు. రోడ్డుపక్కన నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసి, ప్రవీణ్ హత్యలు చేస్తున్నాడని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడ్ని పట్టుకున్నామని, చాలా ఆధారాలు సేకరించామని చెప్పారు. హత్యలు జరిగిన 12 గంటలోనే హంతకుడిని ట్రేస్ చేసి, పట్టుకున్నామని అన్నారు. 2011లోనే ప్రవీణ్‌పై ట్రిపుల్ మర్డర్ కేసు నమోదు అయ్యిందని.. అప్పట్లో చంద్రయ్య, ఓ మైనర్ బాలుడ్ని, గీత అనే మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. ప్రవీణ్‌పై రెండు చోరీ కేసులూ ఉన్నాయన్నారు. 2014లో జీవిత జైదు పడింది. ఇతనికి ప్రతీ కేసులోనూ శిక్ష పడిందన్నారు. 2011లో పిల్లర్ నంబర్ 127 వద్ద పడుకున్న బెగ్గర్‌ను ప్రవీణ్ హతమార్చినట్లు తేలిందని.. 2011లో 302 & 307 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇటీవల రాజేంద్రనగర్‌లోని బుడ్వెల్ వద్ద ఓ బెగ్గర్‌ని హత్య చేశాడన్నారు.
Balayya : నోరు జారిన బాలయ్య.. శ్రీలీలా సీక్రెట్ రివిల్..
జరిగిన హత్య కేసులన్నీ సేమ్ సీన్ నేరాన్ని తలపించాయని డీసీపీ తెలిపారు. బెగ్గర్‌ల వద్ద పడుకున్నట్టు నటించి, అందరూ పడుకున్నాక బండరాయి వేసి హతమారుస్తాడని తెలిపారు. ప్రవీణ్‌కి మొత్తం 10 ఏళ్లపాటు జైలు శిక్ష పడిందన్నారు. మైలార్‌దేవ్ పల్లి లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో నిందితుడు ప్రవీణ్ కొంతకాలంగా నివాసం ఉంటున్నాడన్నారు. ఇప్పటివరకు 8 మందిని హత్య చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. 2010, 2011లో జరిగిన 8 పాత హత్య కేసుల్లోనూ ప్రవీణ్ ప్రధాన నిందితుడని తెలిపారు. ఇతనికి పాత నేరస్తులు ఫయాజ్, నరేష్2లు అసోసియేట్‌గా ఉన్నార్నారు. హత్యల వెనుక ప్రవీణ్ రకరకాల కారణాలు చెప్తున్నాడన్నారు. తమపై చేతబడి చేస్తారన్న ఆరోపణలతో, మద్యం సేవించేందుకు డబ్బుల కోసం హత్యలు చేస్తున్నానని అతడు కారణాలు చెప్తున్నాడని తెలిపారు. సైకో కిల్లర్‌పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్న ఆయన.. నిందితుడ్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు.
తాజావార్తలు
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!