Hijab: పరీక్షకు వచ్చిన స్టూడెంట్స్.. హిజాబ్ తొలగించాలన్న కాలేజీ యాజమాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hijab: కర్నాటకలో హిజాబ్ వివాదం సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అది కాస్త ఇతర రాష్ట్రాలకు సైతం పాకింది. ముస్లీం యువతులు హిజాబ్ ధరించి కాలేజీ రావద్దంటూ యాజమాన్యాలు ఆంక్షలు విధించడంతో తీవ్ర పరిణామాలకు దారి తీసాయి. హిజాబ్ ధరించడం మా జన్మ హక్కు అని, హిజాబ్ ధరించి తీరుతామని మహిళలు పట్టుబట్టారు. అంతేకాకుండా హిజాబ్ ను ఎవరైనా ముట్టుకుంటే చేతులు నరికేస్తాం అంటూ వాదనలు ప్రతివాదనలు చేసుకున్నారు. ఈ వివాదంలో పలు పార్టీలో కూడా తోడవడంతో హిజాబ్ వివాదం దేశంలో చర్చనీయాంసంగా మారింది. అయితే హిజాబ్ వివాదం కాస్తా ఇప్పుడిప్పుడే సర్దుమణిగింది దీనిపై అందరూ సానుకూలంగా స్పందించారు. హిజాబ్ ను ముస్లిం మహిళలు ధరిస్తారనే ప్రకటనలతో ఏకీభవించారు. ఇప్పుడు ఈ వివాదం కాస్త మళ్లీ చెలరేగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ర్టానికి పాకింది. ఓ మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చిన ముస్లీం మహిళలను హిజాబ్ తొలగించాలని కోరడంతో ఇది కాస్త అగ్గిరాసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని సంతోషనగర్ కె.వి. రంగారెడ్డి మహిళ డిగ్రీ కళాశాలలో జరిగింది.
Read also: Home Loans: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ అందిస్తున్న 10 బ్యాంకులు..
Also Read
సంతోష్ నగర్ ఐ.ఎస్.సధన్ చౌరస్తాలో ని కె.వి. రంగారెడ్డి మహిళ డిగ్రీ కళాశాలలో చెందిన కొంతమంది ముస్లిం విద్యార్థులు ఉర్దూ మీడియం డిగ్రీ పరీక్ష రాయడానికి వందలాది మంది హిజాబ్ ధరించి ఇక్కడికి వచ్చారు. కళాశాల సెంటర్ వద్ద సిబ్బంది హిజాబ్ ధరించి వచ్చిన యువతులను అడ్డుకున్నారు. హిజాబ్ ధరించడం వల్ల ఎవరో గుర్తు పట్టలేమని తెలిపారు. పరీక్ష సెంటర్ లోకి అనుమతించాలంటే హిజాబ్ తీసి వెళ్లాలని తెలిపారు. అయితే యువతులు మాత్రం హిజాబ్ తీయడానికి ససేమిరా అన్నారు. పరీక్ష రాయడానికి లోనికి అనుమతించాలని కోరారు. అయినా యాజమాన్యం మాత్రం అనుమతించలేదు. ఒకరినొకరు వాదోపవాదలు చేసుకున్నా అనుమతి నిరాకరించారు. ముస్లీం యువతులు దాదాపు అరగంట పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. చివరకు గత్యంతరం లేక హిజాబ్ తీసి పరీకా కేంద్రానికి వెళ్లారు.
అయితే ముస్లీం యువతులు మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రానికి వచ్చిన మాకు సుమారు అరగంట పాటు లోనికి అనుమతించాలేదని అన్నారు. ఇంతకు ముందు ఇలా కాలేజీ యాజమాన్యం ఇలా ప్రవర్తించలేదని అన్నారు. ఇప్పుడు ఎందుకు ఇలా చేసిందని అర్థం కావడం లేదని వాపోయారు. హిజాబ్ తీసేంత వరకు అనుమతిని నిరాకరించిందని, హిజాబ్ తొలగించాకే పరీక్ష కేంద్రంలోకి అనుమతించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్దతి కాదని అన్నారు. రేపటి నుంచి హిజాబ్ తొలగించి రావాలని కళాశాల యాజమాన్యం వారిని హెచ్చరించిందని అన్నారు. ఇది పరీక్ష నిబంధనలకు విరుద్ధమని కళాశాల అధికారులు చెప్పారని తెలిపారు. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు హోంమంత్రి మహమూద్ ఆలీకి ఫిర్యాదు చేసామని అన్నారు. హిజాబ్ తో విద్యార్థినులను కేంద్రంలోకి అనుమతిచక పోవడం సరి కాదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
Read also: Pakistan: బిపర్జోయ్ ముప్పును తప్పించుకున్న పాకిస్థాన్ .. ఇళ్లకు తిరిగొస్తున్న ప్రజలు
హిజాబ్ వివాదాన్ని హోంమంత్రి మహమూద్ ఆలీ ఎలా స్పందించారు. ముస్లీం మహిళలకు హిజాబ్ అనేది సర్వసాధారణమని అన్నారు. మహిళలకు ఒంటినిండా బట్టలు దరించడం మంచి సాంకేతమే అన్నారు. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడుతామని అన్నారు. ఇది సరైన పద్దతి కాదని తెలిపారు. తప్పకుండా దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు వారి నచ్చిన దుస్తులు వేసుకోవడం వారి జన్మ హక్కు అని అన్నారు. దానిని కాదనే అధికారం ఎవరికి లేదని అన్నారు.
Pakistan: బిపర్జోయ్ ముప్పును తప్పించుకున్న పాకిస్థాన్ .. ఇళ్లకు తిరిగొస్తున్న ప్రజలు
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!