Bandi Sanjay : ‘జెన్-జీకి మంత్రి పదవులు ఇవ్వండి’.. రేవంత్‌కు బండి సంజయ్ సవాల్
- రేవంత్‌కు బండి సంజయ్ సవాల్
- యువతకు మంత్రి పదవుల డిమాండ్
- ఖాళీ శాఖలు జెన్-జీకి ఇవ్వాలన్న సూచన
- కాంగ్రెస్‌పై బీజేపీ నేత విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ సంచలన సవాల్ విసిరారు. రాష్ట్రంలో మాటలు చెప్పడం కాదని, చిత్తశుద్ధి ఉంటే 21 నుండి 30 ఏళ్ల వయస్సున్న ‘జెన్-జీ’ (Gen-Z) యువతకు మంత్రి పదవులు ఇచ్చి ఆచరణలో చూపించాలని డిమాండ్ చేశారు. సీఎం వద్ద ఖాళీగా ఉన్న హోమ్, విద్యా, మున్సిపల్ వంటి కీలక శాఖలను యువతకే అప్పగించాలని వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న కొందరు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి, ఆ పదవులను జెన్-జీ యువతకు ఇవ్వాలని, కాంగ్రెస్ దృష్టిలో జెన్-జీ లంటే విహెచ్, కేకే, కోదండరెడ్డి అనుకుంటున్నారా అంటూ సంజయ్ ఎద్దేవా చేశారు.
వయోభారంతో ఉన్న పెద్దలకు యూత్ కోటాలో పదవులు కట్టబెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ “దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్” అనే సిద్ధాంతానికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సిద్ధాంతంలో భాగమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని గుర్తుచేశారు. యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని మాటలతో మోసం చేయకుండా, నిజంగా యువ శక్తిపై నమ్మకం ఉంటే రాష్ట్ర పాలనలో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి సర్కారును సంజయ్ డిమాండ్ చేశారు.
Also Read
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!