Hyderabad: దేశంలోనే అత్యంత సేఫ్ సిటీగా మూడో స్థానంలో హైదరాబాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: దేశంలోని అన్ని మెట్రో నగరాలలో భద్రత గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం దేశంలోనే సేఫ్ సిటీగా నిలిచింది. ఈ జాబితాలో రెండో స్థానంలో మహారాష్ట్రలోని పుణే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2021లో హైదరాబాద్ నగరంలో మొత్తం 2,599 నేరాలు నమోదయ్యాయి. కోల్‌కతా 1,034 నేరాలతో అతి తక్కువ నేరాలు జరిగే మెట్రో నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. 2,568 నేరాలతో పుణే రెండో స్థానంలో ఉంది. అయితే దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో అట్టడుగున నిలవడం గమనించాల్సిన విషయం.
ఢిల్లీలో ప్రతి 10 లక్షల జనాభాకు 18,596 నేరాలు జరుగుతున్నాయి. దీంతో దేశంలో అత్యధిక నేరాల రేటును ఢిల్లీ కలిగి ఉంది. సూరత్, కొచ్చిన్, అహ్మదాబాద్, చెన్నై నగరాలు అత్యధిక నేరాల రేటు గల మెట్రో నగరాల జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ పొరుగున ఉండే కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతి మిలియన్ జనాభాకు 4,272 నేరాలు జరుగుతున్నాయి. దేశంలో సురక్షితమైన నగరాల్లో బెంగళూరు ఐదో స్థానంలో ఉంది. లక్ష జనాభాను పరిగణనలోకి తీసుకుంటే కోల్‌కతాలో 104.4, పూణేలో 256.8, హైదరాబాద్‌లో 259.9 నేరాలు నమోదయ్యాయి. బెంగళూరులో 427.2 నేరాలు, ముంబైలో 428.4 నేరాలు జరుగుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.
Also Read
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
Read Also: Supreme Court: టీవీ ఛానళ్లలో విద్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్.. యాంకర్లదే బాధ్యత..!
గత ఏడాది కోల్‌కతాలో 45, హైదరాబాద్‌లో 98, బెంగళూరులో 152, దిల్లీలో 454, ముంబైలో 162 హత్య కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో పేర్కొంది . హత్యాయత్నాలకు సంబంధించి కోల్‌కతాలో 135, హైదరాబాద్‌లో 192, బెంగళూరులో 371, దిల్లీలో 752, ముంబైలో 349 కేసులు నమోదయ్యాయి. అటు అత్యాచార కేసులకు సంబంధించి కోల్‌కతాలో 11, హైదరాబాద్‌లో 116, బెంగళూరులో 117, ఢిల్లీలో 1,226, ముంబైలో 364 కేసులు నమోదయ్యాయి. మహిళలపై దాడులకు సంబంధించి కోల్‌కతాలో 127, హైదరాబాద్‌లో 177, బెంగళూరులో 357, ఢిల్లీలో 1,023 కేసులు నమోదయ్యాయి.
జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం 2021 సంవత్సరంలో దేశంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందని రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. pic.twitter.com/oPCRPtP8QH
— AIR News Hyderabad (@airnews_hyd) September 21, 2022
తాజావార్తలు
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!