టీవీ ఛానళ్లలో విద్వేషపూరిత ప్రసంగాలపై సీరియస్ అయ్యింది సుప్రీంకోర్టు.. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ, విద్వేష ప్రసంగాలను సహించేదిలేదని పేర్కొంది.. అయితే, అలాంటి వాటిని ఆపాల్సిన బాధ్యత టీవీ యాంకర్లదేనని స్పష్టం చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ ప్రభుత్వం మౌనంగా ప్రేక్షకుడిగా ఎందుకు మిగిలిపోయింది అని
ప్రశ్నించింది.. ద్వేషపూరిత ప్రసంగాలపై టీవీ ఛానళ్లలో మాట్లాడుతున్నప్పుడు యాంకర్ పాత్ర చాలా ముఖ్యమైనది అని పేర్కొంది.
Read Also: Chhello show: ఆ సినిమా ఆస్కార్ ఎంపికపై ఎన్. శంకర్ విస్మయం!
ప్రధాన స్రవంతి మీడియా లేదా సోషల్ మీడియాలో ఈ ప్రసంగాలు క్రమబద్ధీకరించబడవు. ఎవరైనా ద్వేషపూరిత ప్రసంగాలు కొనసాగించకుండా చూడటం యాంకర్ల కర్తవ్యం. పత్రికా స్వేచ్ఛ ముఖ్యం… కానీ, మనది యూఎస్ అంత స్వేచ్ఛ కాదు, కానీ మనం ఎక్కడ గీత గీసుకోవాలో తెలుసుకోవాలి అని జస్టిస్ కేఎం జోసెఫ్ పేర్కొన్నారు.. విదేశాల్లో విద్వేష ప్రసంగాలు ప్రసారం చేస్తే జరిమానా విధించడంతో పాటు ప్రసారాలను నిలిపివేస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. అలాంటి ప్రసంగాలను అరికట్టేందుకు కఠిన నియంత్రణ అవసరమని అభిప్రాయపడింది సుప్రీం.. ఇదే సమయంలో.. విద్వేష ప్రసంగాలపై కేంద్ర సర్కార్ మౌనంగా ఉండటాన్ని తప్పుబట్టింది. ఇదేమైనా చిన్న విషయమా అని ప్రశ్నించింది. ఈ అంశంలో కేంద్రం ప్రతివాదిలా వ్యవహరించకుండా కోర్టుకు సాయం చేయాలని సూచించింది. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 23కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు..