Huzurabad Clash : హుజూరాబాద్‌లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- బండి సంజయ్ పై వ్యాఖ్యలతో భగ్గుమన్న బీజేపీ
- కౌశిక్ క్యాంప్‌పై దూసుకెళ్లిన కార్యకర్తలు
- కర్రలతో దాడులు.. రంగంలోకి పోలీసులు
- హుజూరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huzurabad : తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం దాడుల వరకు వెళ్లింది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఉద్దేశించి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపైకి దూసుకెళ్లారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు తొలుత కరీంనగర్‌లో ఆందోళనకు దిగారు. అక్కడ గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న కౌశిక్ రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన పోలీసులు, భారీ బందోబస్తు మధ్య కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి హుజూరాబాద్‌కు తరలించారు.
Also Read
కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ చేరుకున్నాక, అక్కడ కార్యకర్తలతో సమావేశమవుతుండగా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను కౌశిక్ రెడ్డి అనుచరులు కర్రలతో అడ్డుకున్నారు. పోలీసుల కళ్లముందే ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. బీఆర్‌ఎస్ శ్రేణులు కర్రలతో దాడి చేయగా, బీజేపీ శ్రేణులు ప్రతిదాడికి దిగాయి.
పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. ఘర్షణకు కారణమైన బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు క్యాంప్ కార్యాలయ గేట్లు వేసి లోపలే ఉంచేశారు. ఈ ఘటనపై పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ.. తనపై హత్యాయత్నం జరిగిందని, రాడ్లు, కత్తులతో దాడులు చేశారని ఆరోపించారు.
ప్రస్తుతం హుజూరాబాద్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాజకీయ పక్షాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఈ ఘర్షణలు జిల్లాలో శాంతిభద్రతలపై చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..