KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
- విద్యార్థుల పోరాటానికి కేటీఆర్ ప్రశంసలు
- పదవుల కంటే ప్రజా బలమే గొప్పదన్న వ్యాఖ్యలు
- ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోవాలని సూచన
- యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదవుల్లో ఉన్న అధికారుల కంటే ప్రజల బలమే ఎప్పుడూ గొప్పదని, ఆ విషయాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థులు , యువత నిర్వహించిన ఉద్యమం మరోసారి నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ అండ లేకుండా, రాజకీయ పార్టీలకు అతీతంగా తమకు జరిగిన అన్యాయాన్నే ప్రధాన ఎజెండాగా చేసుకుని విద్యార్థులు సాగించిన ఈ పోరాటం ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. యువత చూపిన తెగువ, ఐక్యత , పోరాట పటిమ దేశానికే స్ఫూర్తిగా నిలిచాయని వ్యాఖ్యానించిన కేటీఆర్, ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ‘జెన్-జీ’ (Gen-Z) యువతకు హృదయపూర్వక సెల్యూట్ తెలియజేశారు.
ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోవాలి
యువత లేవనెత్తిన ప్రశ్నలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు కేవలం రాజకీయాలకే పరిమితమైతే భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. పదవుల్లో ఉన్నవారు తమ నిర్ణయాలు , తప్పులకు బాధ్యత వహించాల్సిన సమయం వచ్చిందని, విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాల్సిన అవసరాన్ని ఈ ఉద్యమం స్పష్టంగా చాటిచెప్పకనే చెప్పిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన గుణపాఠం నేర్చుకొని, యువతకు అత్యంత కీలకమైన విద్యా, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read
- Tags
- BRS
- Gen Z
- ktr
- People's Power
- Politics
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!