Buy Back : సైబరాబాద్ లో బై బ్యాక్ పేరుతో మరో భారీ మోసం బయటపడింది. అధిక వడ్డీలు చెల్లిస్తామంటూ బాధితులను నిండా ముంచేశారు. పలు స్కీముల పేరుతో ఆటపాకల వెంకటేశ్, సురేష్ అనే ఇద్దరు ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. వి ఓన్ ఇన్‌ఫ్రా గ్రూప్స్ బై బ్యాక్ పేరుతో ఈ వసూళ్లకు పాల్పడ్డారు. పెట్టిన పెట్టుబడికి డబుల్ వడ్డీ వస్తుందంటూ నమ్మించారు. వారి మాటలు నమ్మి దాదాపు 90 మంది పెట్టుబడులు పెట్టారు. రియల్…
థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసానికి పాల్పడుతున్నారు. రూ.12 లక్షలు కడితే సంవత్సరానికి 36 లక్షల రూపాయలు మీ ఖాతాలో జమవుతుందంటూ బాధితులకు నమ్మబలికారు. తీరా డబ్బుల గురించి అడిగితే మాయమాటలు చెబుతున్నారు. ఈ క్రమంలో మోసపోయామాని తెలుసుకున్న కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మనీ స్కీం పేరుతో నెల్లూరులో మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. కలువాయికి చెందిన వరాల కొండయ్య తన కుమారుడు సునాతం పేరుతో నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ట్రస్టు ద్వారా వివిధ ఏజెంట్ నియమించుకొని ప్రజల నుంచి రూ.500 నుంచి 6 వేల రూపాయల వరకూ వసూలు చేశారు.
నిరుద్యోగులే పెట్టుబడిగా దేశ వ్యాప్తంగా భారీ మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో దేశంలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు.