TS Heavy Rain: రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో సాయంత్రం వర్షం కురిసే అవకాశం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Heavy Rain: ఇప్పటికే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో అక్కడక్కడ వానలు కురుస్తుండగా, గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అయితే నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయి. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. అలాగే రేపటి నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Also Read
- Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Medak: ఉమ్మడి మెదక్‌లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Hyderabad: అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
Read also: Viral: ‘టిప్-టిప్ బర్సా పానీ’లో ఈ హాట్‌నెస్ రవీనాకు కూడా సాధ్యం కాలేదు
హైదరాబాద్‌లో శుక్రవారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో నేడు గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో 74.6, నిర్మల్ జిల్లా ముంధోల్‌లో 73.2, మంచిర్యాల జిల్లా జనగాంలో 61.2, గాంధారిలో 55.4, మద్నూర్‌లో 54.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్‌లో వెల్లడించింది. ఉష్ణోగ్రతల విషయానికొస్తే… నిన్న నల్గొండలో అత్యధికంగా 35 డిగ్రీలు, హయత్‌నగర్‌లో 21 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా 10 క్రూయిజ్ క్షిపణులతో దాడి.. ఐదుగురు మృతి.. ఆగ్రహించిన జెలెన్ స్కీ
తాజావార్తలు
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ సేల్ స్టార్ట్.. రూ. 10000 డిస్కౌంట్! 6,000mAh బ్యాటరీ, 8.1-అంగుళాల స్క్రీన్
-
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్‌తో H-1B ఇండియన్లలో భయం..
-
Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్‌టాప్ బహుకరించిన మెగాస్టార్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!