టౌటే తుఫాన్ ధాటికి తీరప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఆ తుఫాన్ ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇక, దీని ప్రభావం తెలుగురాష్ట్రాలపై పడింది. హైదరాబాద్‌లో ఈ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుల సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే భారీ వర్షం కురవడం మొదలైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, సికింద్రాబాద్, చిక్కడపల్లి, కోఠీలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.