కేసీఆర్ కొత్త డ్రామా: మల్లు రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్ కొత్త డ్రామాలకు తెర తీశారని, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి ఆరోపించారు. రైతులు పండించిన పంటను ప్రతీసారి రాష్ర్ట ప్రభు త్వమే ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు రైస్ మిల్లర్లకు సరఫరా చేసి ఎఫ్సీఐకి లేవీ పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ ద్వారా డబ్బులు తీసుకునే ఆనవాయితీ ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చేతకాని తనం వల్ల రాజకీయ లబ్ధికోసం ధర్నాలు చేయటం సరైన పద్ధతి కాదన్నారు. వరి పంట కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారన్నారు.
గతంలో శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వరి పంట విష యంలో రైతులను భయపడొద్దని, మొన్న మీడియా సమావేశంలో వరి వేయద్దని చెప్పడం కేసీఆర్ ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు. తక్ష ణమే రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్రంలో రైతులను పట్టించుకోవాలన్నారు. పండించిన ప్రతి పంటను కొనుగోలు చేసే విధంగా సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలని మల్లు రవి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ఓట్లు వేసింది టీఆర్ఎస్ పార్టీకి.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ర్ట ప్రభుత్వం, కేంద్ర ప్రభు త్వం ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని వరిపంట కొనాలని ధర్నా చేయడం హస్యస్పందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
రైస్ మిల్లర్లు ధాన్యం రాకుండానే ట్రక్ షీట్లతో ధాన్యం వచ్చినట్టు రాసుకుని వారి బినామీ వ్యక్తుల అకౌంట్లలో డబ్బులు జమ చేసుకుని పంచుకున్న సంఘటనలు రాష్ర్ట వ్యాప్తంగా వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తక్షణమే రాష్ర్ట ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లు రవి డిమాండ్ చేశారు.
- Tags
- congress
- kcr
- Mallu Ravi
- TRS
తాజావార్తలు
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
ట్రెండింగ్
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!