AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- లావా అగ్ని 4N స్మార్ట్‌ఫోన్..
- యూకే మార్కెట్లో అధికారికంగా లాంచ్..
- 6.67 అంగుళాల 1.5K 120Hz AMOLED డిస్ప్లే
- 4nm టెక్నాలజీతో తయారైన MediaTek Dimensity 8350 ప్రాసెసర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lava AGNI 4N Launched: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా లిమిటెడ్ (Lava) అంతర్జాతీయ మార్కెట్లో మరో కీలక అడుగు వేసింది. కంపెనీ తన ప్రీమియం అగ్ని (AGNI) సిరీస్‌లో భాగమైన లావా అగ్ని 4N (Lava AGNI 4N) స్మార్ట్‌ఫోన్‌ను యూకే మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అందుబాటు ధరలో మిడ్‌రేంజ్ నుంచి హైఎండ్ ఫీచర్లను అందించడమే లక్ష్యంగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. యూకేలో అగ్ని సిరీస్ విడుదల కావడం మొదటిసారి. ఈ లాంచ్ కోసం SW నెట్వర్క్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది.
ఈ కొత్త మొబైల్ లో 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 1220 × 2712 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 2,400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.07 బిలియన్ రంగులు, 446 PPI, 100%కి పైగా NTSC కలర్ గామట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కల్పించారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4nm టెక్నాలజీతో తయారు చేసిన MediaTek Dimensity 8350 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది 3.35GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Mali-G615 MC6 GPU ఉంది. ఫోన్ 8GB LPDDR5X RAM, 256GB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.
Also Read
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
- Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
- Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
మొబైల్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరాను అందించారు. ఇది 1/1.55 అంగుళాల సెన్సార్, f/1.88 అపెర్చర్‌తో పనిచేస్తుంది. దీనికి 8MP అల్ట్రా వైడ్ కెమెరా జత చేశారు. వీడియో రికార్డింగ్‌లో 4K 60fps వరకు సపోర్ట్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరాను ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా కూడా 4K 60fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్లో 5,000mAh బ్యాటరీని అందించారు. దీనికి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, USB టైపు-C ఆడియో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఫోన్‌కు IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ లభించింది. కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, GPS, GLONASS, Galileo, QZSS, Beidou వంటి సదుపాయాలు ఉన్నాయి. అలాగే కంపెనీకి చెందిన Vayu AI వ్యవస్థను అందించారు. ఇందులో వాయిస్ ఆధారిత కాంటెక్స్ట్ ఇంటరాక్షన్స్, Circle-to-Search వంటి ఫీచర్లు ఉన్నాయి. AI Text Assistant, AI Call Summary, Document/Image Analyzer వంటి టూల్స్ కూడా లభిస్తాయి. ఫోటోగ్రఫీ కోసం AI ఫోటో ఎడిటర్, ఇమేజ్ జనరేటర్, సీన్ ఆప్టిమైజేషన్ వంటి జనరేటివ్ AI ఫీచర్లను కూడా ఫోన్లో అందించారు.
We didn't break up with SAM.
SAM got dumped.
For being slow.
For carrying baggage.
And for testing our patience.Meet the Lava Agni 4N.
It Does What SAM Can’t.Sale starts 04.09.26 on Amazon.
Only £499.To know more, visit https://t.co/OO7mcJgYhT #DoesWhatSAMCant #Lava… pic.twitter.com/33nDNirp2F
— Lava Mobiles UK (@lavamobilesuk) August 31, 2026
Lava AGNI 4N యూకేలో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఫాంటమ్ బ్లాక్, లూనార్ మిస్ట్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర £499గా నిర్ణయించారు. యూకేలో సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ UK ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అమ్మకాల తర్వాత సేవలను SBE Ltd భాగస్వామ్యంతో లావా అందించనుంది. హార్డ్‌వేర్ లోపాలకు 24 నెలల హ్యాండ్సెట్ రీప్లేస్మెంట్ వారంటీ, బ్యాటరీకి 12 నెలల వారంటీ, డేటా కేబుల్‌కు 6 నెలల వారంటీని కంపెనీ అందిస్తోంది.
తాజావార్తలు
-
Srikanth Odela: ‘దసరా’ కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో ‘ప్యారడైజ్’..
-
H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
-
Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
-
Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!