Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- తుమ్మిడిహట్టి బ్యారేజ్పై..
- నేడు ఢిల్లీలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కీలక భేటీ..
- కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్లో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thummidihatti Barrage: తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నెలకొన్న అంశాలపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు.
ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా బ్యారేజ్ ఎత్తు, నీటి వినియోగం, ముంపు తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
తుమ్మిడిహట్టి బ్యారేజ్ను 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర గతంలో అంగీకరించింది. అయితే ఈ ఎత్తుతో అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. 148 మీటర్ల వద్ద నీటిని తరలించేందుకు భారీ పంపులను వినియోగించాల్సి వస్తుందని, దీంతో విద్యుత్ వ్యయం గణనీయంగా పెరుగుతుందని తెలంగాణ సర్కార్ చెబుతోంది. అందువల్ల బ్యారేజ్ ఎత్తును 152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్రను ఒప్పించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 152 మీటర్ల ఎత్తుతో నీటిని తక్కువ విద్యుత్ వ్యయంతో తరలించడంతో పాటు దీర్ఘకాలంలో రాష్ట్రానికి ప్రాజెక్టు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తన వాదనను వినిపిస్తోంది.
మరోవైపు సీడబ్ల్యూపీఆర్ఎస్ అధ్యయనాల ప్రకారం జలమట్టాన్ని పెంచడం వల్ల అదనంగా ఏర్పడే ముంపు పరిమితంగానే ఉంటుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఈ అంశాన్ని కూడా సమావేశంలో మహారాష్ట్ర అధికారుల ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. వెనుకబడిన, కరవు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించడంలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కీలకంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం, మహారాష్ట్రతో చర్చలను ముందుకు తీసుకెళ్తోంది.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో ప్రధానమంత్రిని కోరారు. అలాగే మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రేవంత్రెడ్డి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య సమావేశం నిర్వహించి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో నేటి ఢిల్లీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..