Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rainfall Deficit: తెలంగాణలో ఈ ఏడాది వర్షాకాలం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 20 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు మూడు నెలల్లో సాధారణంగా 581 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 462 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో వర్షాల లోటు ఆందోళన కలిగిస్తోంది. నెలల వారీగా చూస్తే.. జూన్లో సాధారణం కంటే 8 శాతం, జూలైలో 10 శాతం వర్షపాతం లోటు నమోదైంది. అయితే ఆగస్టులో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఆ నెలలో ఏకంగా 42 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో సాగు, తాగునీరు, భూగర్భ జలాలపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలోని జిల్లాల వారీ పరిస్థితిని పరిశీలిస్తే.. కేవలం 13 జిల్లాల్లో సాధారణ స్థాయి వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. మరో 19 జిల్లాల్లో తీవ్ర వర్షపాతం లోటు ఉన్నట్లు వెల్లడించారు. అయితే కామారెడ్డి జిల్లాలో మాత్రం సాధారణం కంటే 25 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని తెలిపారు. వర్షాకాలంలో చివరి నెల అయిన సెప్టెంబర్పైనే ఇప్పుడు రైతులు, ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అయితే సెప్టెంబర్లోనూ వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని వాతావరణ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 శాతం వరకు వర్షపాతం లోటు నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
మరోవైపు వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా సెప్టెంబర్లో ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరగవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో సెప్టెంబర్లో వాతావరణం ఎండాకాలాన్ని తలపించే పరిస్థితులు కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటడం, ఎల్ నినో ప్రభావం తీవ్రతరం కావడం వంటి పరిణామాలు వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పెద్దగా వర్షాలు కురిసే అవకాశాలు తగ్గుతాయని అంచనా. అయితే బంగాళాఖాతంలో లో ప్రెషర్ లేదా ఇతర వాతావరణ వ్యవస్థలు ఏర్పడితేనే తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్లో వర్షాల పరిస్థితి ఎలా ఉంటుందనేది రానున్న రోజుల్లో ఏర్పడే వాతావరణ వ్యవస్థలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!