Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Glenn Phillips Catch Video: ‘గ్లెన్ ఫిలిప్స్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కళ్లు చెదిరే, ఊహించని క్యాచ్‌లకు పెట్టింది పేరు ఈ న్యూజిలాండ్ ఆటగాడు. ఫిలిప్స్ ఇప్పటికే ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లు పట్టాడు. అందులో కొన్ని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఫిలిప్స్ పట్టిన ఓ ఊహించని క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బౌండరీ లైన్ దగ్గర ఫిలిప్స్ ఒంటి చేత్తో పట్టిన క్యాచ్‌ను చూసి.. అతడే స్వయంగా ఆశ్చర్యపోయాడు. ఇందుకు సబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. మీరు క్రికెట్ అభిమాని అయితే.. ఆ వీడియో తప్పక చూడాల్సిందే.
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2026లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. గయానా ముందుగా బ్యాటింగ్ చేసి 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ట్రిన్‌బాగో జట్టు రెండో ఓవర్ ముగిసే సమయానికి 17/0 స్కోర్ చేసింది. మూడో ఓవర్లో డ్వైన్ ప్రిటోరియస్ వేసిన బంతిని సునీల్ నరైన్ భారీ షాట్‌గా మలిచే ప్రయత్నం చేశాడు. బంతి డీప్ మిడ్ వికెట్ వైపు గాల్లోకి వెళ్లగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ బౌండరీ రోప్‌కు సమీపంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి ఒక్క చేత్తో బంతిని అందుకున్నాడు.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ 'గోట్'గా మనోడే!
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
క్యాచ్ పట్టుకున్న వెంటనే గ్లెన్ ఫిలిప్స్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తాను క్యాచ్ ఎలా పట్టుకున్నానో అన్నట్లుగా ఆశ్చర్యపోయాడు. ఫిలిప్స్ ముఖంలో హావభావాలు వైరల్ అయ్యాయి. ‘సూపర్ మ్యాన్’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బౌండరీ వద్ద బ్యాలెన్స్ కోల్పోకుండా, ఒక్క చేత్తో బంతిని అద్భుతంగా అందుకోవడం అతడి ఫీల్డింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా మారింది. ఫిలిప్స్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా ఉన్నాడు. ముఖ్యంగా డైవింగ్ క్యాచ్‌లు, వన్ హ్యాండ్ క్యాచ్‌లు, గాల్లోకి ఎగిరి పట్టే క్యాచ్‌ల విషయంలో అతడిని కొట్టేవాడే లేడు. అభిమానులు అతడిని ‘సూపర్ మ్యాన్’ అని పిలుస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్లో ఫిలిప్స్ ఖాతాలో ఇప్పటికే 112 క్యాచ్‌లు ఉన్నాయి.
Glenn Phillips! Stop That! 🤯🤯🤯
A crazy one-handed catch from Phillips! 🇹🇹 x 🇬🇾#CPL26 #TKRvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport #OmegaXL pic.twitter.com/eFHMjjWf6U
— CPL T20 (@CPL) September 1, 2026
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!