Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో పాటు మూడు మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు, పోలీసు అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలను నగరంలో శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం.
సామూహిక ఉత్సవాలు ఘనంగా జరగడానికి వీలుగా గణేష్ మండపాల నిర్వహణ, శానిటేషన్, తగిన భద్రత, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా భక్తులు మట్టి వినాయక విగ్రహాలనే ఉపయోగించాలని కోరారు. అలాగే ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భక్తులకు మొక్కలు పంపిణీ చేయాలని మరియు చేనేత కండువాలు వాడాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
గతంలో బోనాల ఉత్సవాల సమయంలో మంచి వర్షాలు పడాలని ఆలయాల్లో పూజలు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ గణేష్ ఉత్సవాల్లో కూడా ఎల్ నినో ప్రభావం తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ప్రభుత్వాభిప్రాయంగా ఉత్సవ సమితికి సూచించారు. న్యాయస్థానాల ఉత్తర్వులను పూర్తిగా గౌరవిస్తూనే ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఎలాంటి అనవసర నియంత్రణలు లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా, ఉత్సాహంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!