దవాఖానలో చికిత్స పొందుతున్న బాలింతలు తమ చిన్నారులకు ప్రైవేట్ మందులను వాడటాన్ని గమనించి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సీరియస్ అయ్యారు. నగరంలోని కోఠి ప్రభుత్వ ప్రసూతి దవాఖానను హరీశ్ రావ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానకు వస్తూనే నేరుగా వార్డులన్నీ కలియతిరిగారు. దవాఖానలో అందుతున్న వైద్యసేవలపై రోగులు, వారి సహాయకులతో ఆరాతీశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా వైద్య సేవలను అందిస్తుంటే పేద రోగులకు ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి మందులు తీసుకువచ్చేందుకు ఎందుకు రాస్తున్నారని…