Finance Minister Harish Rao Was cobbled Tribal Welfare Building.
నేడు మెదక్ జిల్లాలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మెదక్ శివారులో రూ. 4.20 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావుకు ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మెదక్ శివారులోని పసుపు లేరు ఒడ్డున సంత్ గాడ్గే బాబా, వెల్కం బోర్డ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహాలను మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి లు అవిష్కరించారు.
వీటితో పాటు పట్టణంలో గిద్దెకట్ట వద్ద దోబీ ఘాట్ కు శంకు స్థాపనతో పాటు రాందాస్ చౌరస్తాలో రోడ్ స్విపింగ్ మిషన్‌ను హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ కోసం రూ.300 కేటాయిస్తున్నామని, తండాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందని ఆయన వెల్లడించారు. తండాల్లో గ్రామ పంచాయతీల నిర్మాణం కోసం రూ. 600 కోట్లు కేటాయించామని, మెదక్ లో మూడు గిరిజన రెసిడెన్షియల్ విద్యాసంస్థల కోసం నిధులు కేటాయించామని ఆయన తెలిపారు.